
పోలింగ్ కేంద్రంలో కన్నీరు పెడుతున్న చైత్ర
బనశంకరి: పోలింగ్ కేంద్రంలో ఓటుహక్కు వినియోగించుకోవడానికి అవకాశం కల్పించకపోవడంతో నిండుగర్భిణి వెక్కివెక్కి ఏడ్చిన ఘటన బనశంకరిలో శనివారం చోటుచేసుకుంది. బనశంకరి రెండవస్టేజ్ బీఎన్‌ఎం కాలేజీ 142 పోలింగ్ కేంద్రంలో శనివారం ఉదయం బనశంకరి రెండవస్టేజ్‌లో నివాసి చైత్ర ఓటుహక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రానికి వచ్చారు. పోలింగ్ కేంద్రంలో ఎన్నికల అధికారికి, చైత్ర ఓటరు గుర్తింపు కార్డు జిరాక్స్ చూపించడంతో కుదరదని ఓటింగ్‌కు నిరాకరించాడు. దీంతో ఆమె అక్కడే తీవ్ర ఆవేదనతో కన్నీటి పర్యంతమయ్యారు. చివరికి ఓ పాత్రికేయుడు జోక్యం చేసుకుని ఓటింగ్‌కు అవకాశం కల్పించారు.