మహిళకు బొట్టు పెట్టి ఆహ్వానిస్తున్న సిబ్బంది
రాయచూరు రూరల్: ప్రతి ఒక్కరూ ఓటేయాలనే ఎన్నికల యంత్రాంగం ప్రచారం కొన్నిచోట్ల వింతగానూ జరుగుతోంది. రాయచూరు జిల్లాలో ఒకడుగు ముందుకేసి పెళ్లి తంతు మాదిరిగా అవగాహనను మార్చేశారు. సమాజంలో మంచి వ్యక్తులను ఎన్నికల్లో ఎన్నుకొనే ఓటు హక్కుపై జాగ్రత వహించాలని ల్లా స్త్రీ శిశు సంరక్షణాధికారి నాగరాజు పిలుపు ఇచ్చారు. శనివారం రాయచూరు నగరంలోని యల్‌బియస్ కాలనీలో జిల్లాధి యంత్రాంగం ఆధ్వర్యంలో ఓటు హక్కు ప్రచారాందోళన వినూత్నంగా జరిగింది. అవగాహన పత్రాలను పెళ్లిపత్రికల మాదిరిగా ముద్రించి ప్రజలకు పంచారు. అందరూ ఎన్నికలో నిర్భయంగా ఓటు వేయాలని, ఓటును అమ్ముకోరాదని పెళ్లి పత్రికల ద్వారా ప్రచారం చేశారు.
శుభ లగ్న పత్రిక....
⇔ ఓటర్ మహాశయులకు పెళ్లి పిలుపు
⇔ భారత ఎన్నికల కమిషన్ నిశ్చయం మేరకు శనివారం అనగా 12–05–2018 ఉదయం 7 గం. నుండి సాయంత్రం 6 గంటల వరకు శుభ ముహూర్తం
⇔ భారత మాతా సుపుత్రుడు
⇔ చి: ఓటరుతో చి.కుం.సౌ: ప్రజా ప్రతినిధి వివాహ నిర్ణయం
⇔ స్థలం: ప్రతి ఒక్క పోలింగ్ కేంద్రం
⇔ ఆహ్వానం: ఈ మంగళకార్యానికి ప్రతి ఓక్కరూ వచ్చి తమ ఓటును వేయాలని ఆకాంక్ష.
Comments
Please login to add a commentAdd a comment