
వైద్యుల నిర్లక్ష్యంతోనే బిడ్డ చనిపోయాడని ఆరోపిస్తున్న భర్త, కుటుంబ సభ్యులు
చీపురుపల్లి: ప్రసవం కోసం వస్తే పట్టించుకోలేదు....ఆస్పత్రిలో చేరితే కనీసం వైద్య పరీక్షలు చేయలేదు...ప్రసూతి వార్డు వైపు సిబ్బంది కన్నెత్తి చూడలేదు....సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా నిండు నూరేళ్లు బతకాల్సిన తమ బిడ్డ పురిటిలోనే లోకాన్ని విడచివెళ్లిపోయాడని కొత్తపేట గ్రామానికి చెందిన బాలింత పొదిలాపు స్వాతి, ఆమె భర్త రాంబాబు, తదితరులు ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. కొత్తపేట గ్రామానికి చెందిన పొదిలాపు స్వాతికి శుక్రవారం ప్రసవ నొప్పులు రావడంతో పది గంటలు సమయంలో కుటుంబ సభ్యులు ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చారు. స్కానింగ్ గదిలో ఓ వైద్యురాలు పరీక్షలు నిర్వహించి అప్పుడే ప్రసవం రాదని చెప్పి అంతవరకు ఆస్పత్రిలో చేరాలని సూచించారు. దీంతో వారు గర్భిణిని ప్రసూతి వార్డులో చేర్పించారు.
ఆ తర్వాత గర్భిణిని ఎవ్వరూ పట్టించుకోలే దు. మధ్యాహ్న సమయంలో స్వాతి బాత్‌రూమ్‌కు వెళ్లగా అక్కడ ప్రసవ నొప్పులు ప్రారంభమయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు పెద్దగా కేకలు వేయడంతో దిగువస్థాయి సిబ్బంది వచ్చి ఆమెను బెడ్‌పై వేశారు. అప్పటికే ఆమె మగబిడ్డను ప్రసవించింది. అప్పటికీ వైద్యులు హాజరవ్వకపోవడంతో కాసేపట్లో బిడ్డ మృతి చెందింది. వైద్యులు పట్టించుకోకపోవడంతోనే తమ బిడ్డ చనిపోయినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇక్కడ చూడమని చెబితే ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లిపోయేవారమని, కేవలం సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ చనిపోయాడని చెబుతూ కన్నీటిపర్యంతమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment