![Skull Base Surgery In GGH Soon - Sakshi](/styles/webp/s3/article_images/2018/04/2/ggh.jpg.webp?itok=cGpo1Jzy)
డాక్టర్ నారాయణ్ జానకిరామ్‌తో డాక్టర్ జీఎస్‌ఎన్ మూర్తి తదితరులు
సర్పవరం (కాకినాడసిటీ): స్కల్ (కపాలం)లో శస్త్ర చికిత్స చేయాలంటే తప్పనిసరిగా దానిని తెరచి చికిత్స చేయాల్సి వచ్చేది. ఈ స్కల్ బేస్ సర్జరీపై ఆదివారం జీజీహెచ్‌లో ఈఎన్‌టీ విభాగాధిపతి డాక్టర్ జీఎస్‌ఎన్ మూర్తి ఆధ్వర్యంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా ఆ శస్త్ర చికిత్స విభాగం నిపుణుడు డాక్టర్ నారాయణ్ జానకిరామ్ హాజరై మాట్లాడుతూ కపాలం తెరవకుండా నాసికా రంధ్రం ద్వారా పైపు పంపించి కపాలం కింద శస్త్ర చికిత్స చేయడం వల్ల రోగులకు మరింత అత్యాధునిక వైద్యం అందించవచ్చని వివరించారు. ఈ అవగాహన సదస్సులో కోస్తా ఆంధ్రా జిల్లాల నుంచి ప్రముఖ ఈఎన్‌టీ వైద్యులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment