కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వరుస ప్రమాదాలపై ఆరా తీస్తున్న కలెక్టర్ కార్తికేయ మిశ్రా
సర్పవరం (కాకినాడ సిటీ): ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో వరుసగా జరుగుతున్న అగ్నిప్రమాదాల నేపథ్యంలో జీజీహెచ్ సిబ్బందిపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం జీజీహెచ్ సూపరింటెండెంట్ ఛాంబర్‌లో అధికారుల సమావేశం ఏర్పాటు చేశారు. వరుస ప్రమాదాలు జరుగుతున్నా జిల్లా కలెక్టర్ పట్టించుకోని తీరుపై సాక్షి వరుస కథనాలతో ఎట్టకేలకు కదలిక వచ్చింది. వైద్యులతో జరిగిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ అగ్ని ప్రమాదాలకు కారణాలు తెలుసుకుని వైరింగ్‌ను పునరుద్ధరించడానికి రూ.25 లక్షలకు ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ యంత్రాల సరఫరా చేసే వైరింగ్‌ను పూర్తిగా మార్చాలన్నారు.
ఈ పనులు మార్చి 2వ తేదీ నుంచి ప్రారంభించాలని సూచించారు. కొరత ఉన్న పడకల విషయమై ‘సాక్షి’ ప్రశ్నించగా కొన్ని బ్లాక్స్ నిర్మాణ దశలో ఉన్నాయని నిర్మాణానంతరం మరికొన్ని పడకలు పెంచుతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జేసీ మల్లికార్జున, నగర పాలక సంస్థ కమిషనర్ శివపార్వతి, సూపరింటెండెంట్ డాక్టర్ రాఘవేంద్రరావు, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మహాలక్ష్మి, సీఎస్‌ఆర్‌ఎం డాక్టర్ మూర్తి, ఏఆర్‌ఎంఓ డాక్టర్ సుధీర్ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment