సాక్షి, విజయవాడ: జీజీహెచ్‌లో రేపు(శనివారం) కోవిడ్ వ్యాక్సిన్ ప్రక్రియను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరిశీలించనున్నారు. ఉదయం 11.30 గంటలకు జీజీహెచ్‌కు సీఎం రానున్నారు. రేపు వ్యాక్సినేషన్ ప్రక్రియను లైవ్ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ కూడా పరిశీలించనున్నారు. శనివారం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 332 కేంద్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. తొలి విడతలో రాష్ట్రంలో 3.83 లక్షల మంది వైద్య సిబ్బందికి వ్యాక్సిన్ వేయనున్నారు. విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో కోవిడ్ వ్యాక్సినేషన్ ఏర్పాట్లను కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ పరిశీలించారు. రేపు విశాఖ, విజయవాడలో వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రధాని మోదీ, సీఎం వైఎస్ జగన్ లైవ్‌లో వీక్షించనున్నారు. వైద్య సిబ్బంది, అధికారులతో ప్రధాని మోదీ మాట్లాడే అవకాశముంది. (చదవండి: గోపూజ మహోత్సవంలో సీఎం జగన్)
Comments
Please login to add a commentAdd a comment