సాక్షి, అనంతపురం: అనంతపురం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. సకాలంలో వైద్యం అందకపోవడంతో ఒక రోగి ఊపిరాడక మృతిచెందిన ఘటన అనంతపురం జీజీహెచ్‌లో జరిగింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా నిండు ప్రాణం బలైంది. ధర్మవరానికి చెందిన రాజు అనే వ్యక్తి అనారోగ్యంతో ఆసుపత్రికి రాగా, వైద్యులు పట్టించుకోలేదు. శుక్రవారం తెల్లవారుజామున మూడుగంటలకు ఆసుపత్రికి వచ్చిన రాజుకు వైద్య చికిత్స సకాలంలో అందించకపోవడంతో ఊపిరాడక మరణించినట్లు తెలిసింది. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆసుపత్రి ఎదుట మృతుడి కుటుంబ సభ్యులు,బంధువులు ఆందోళనకు దిగారు.
Comments
Please login to add a commentAdd a comment