సాక్షి, గుంటూరు : ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి నిప్పంటించుకున్న విషాద సంఘటన శనివారం మధ్యాహ‍్నం గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. పొన్నూరు మండలం పచ్చలతాడిపర్రు గ్రామానికి చెందిన ఓ వివాహిత తన ఇద్దరు పిల్లలతో కలిసి నిప్పంటించుకుంది. గమనించిన చుట్టుపక్కల వారు మంటలను ఆర్పివేసి చికిత్స నిమిత్తం గుంటూరులోని జీజీహెచ్‌కు తరలించారు. కాగా... వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా వివాహిత ఆత్మహత్యాయత్నానికి కుటుంబ కలహాలే కారణమని తెలుస్తోంది.సమాచారం అందుకున‍్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.