ప్రాణాలను బలిగోరిన అత్తాకోడళ్ల గొడవ! | mother commits suicide with children | Sakshi
Sakshi News home page

ప్రాణాలను బలిగోరిన అత్తాకోడళ్ల గొడవ!

Published Wed, Jul 26 2017 12:52 PM | Last Updated on Tue, Nov 6 2018 8:08 PM

ప్రాణాలను బలిగోరిన అత్తాకోడళ్ల గొడవ! - Sakshi

ప్రాణాలను బలిగోరిన అత్తాకోడళ్ల గొడవ!

► యడ్లపాడులో ఇద్దరు పిల్లలతో కలిసి నేలబావిలో దూకిన వివాహిత
►  ఆమెతో పాటు ఇద్దరు పిల్లలూ మృతి
► అత్తాకోడళ్ల మధ్య జరిగిన వివాదం.. మరణం వరకూ
 
యడ్లపాడు(గుంటూరు) : క్షణికావేశాలకు లోనై తీసుకుంటున్న నిర్ణయాలు ప్రాణాలను కూడా బలిగోరుతున్నాయి. దంపతులు చిన్నచిన్న సమస్యలను కూడా ఎదుర్కోలేక కుటుంబాలను ఛిన్నాభిన్నం చేసుకుంటున్నారు. పంతాలతో పట్టింపులతో తాము బలవన్మరణానికి పాల్పడటమే కాక చిన్నారులనూ బలిపెడుతున్నారు.  పసిమొగ్గల జీవితాలను అర్ధంతరంగా ముగిస్తున్నారు. యడ్లపాడులోని ఎస్సీకాలనీలో కేవలం అత్గా కోడళ్ల మధ్య చోటు చేసుకున్న చిన్న వివాదం కారణంగా భూలక్ష్మి అనే వివాహిత తన నాలుగేళ్ల నాలుగేళ్ల కుమారుడు రాముని చంకన పెట్టుకుని, నిద్రిస్తున్న రెండేళ్ల చిన్నారి షకీనను నడుముకు కట్టుకుని నేలబావిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. మంగళవారం ఒకే కుటుంబంలో ముగ్గురు నిలువునా మృతి చెందడంతో కాలనీ వాసులే కాదు చిలకలూరిపేట నియోజకవర్గంలోనే కలంకలం రేగింది. అంతరించిపోతున్న మానవ సంబంధాలను గురించే అంతటా చర్చ కొనసాగుతుంది. 
 
అసలేం జరిగిందంటే...
ఘటన జరగడానికి నాలుగు రోజుల ముందు అత్త కోడిరెక్క చెంచమ్మ కోడలు భూలక్ష్మిని గద్దించింది. అంతే ఆ తర్వాత ఇద్దరి మధ్య వాగ్వాదం పెరిగింది. ఫలితంగా ఇద్దరూ  నాలుగు రోజుల పాటు మాట్లాడుకోలేదు. పొరపొచ్చాల గురించి కుటుంబ సభ్యులు చొరవ తీసుకుని ఉంటే మరణాలు సంభవించేవి కావనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పంతాలకు పోయి క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారుల ప్రాణాలను బలి గొంది. చిన్నచిన్న సమస్యలను సైతం ఎదుర్కోలేక ప్రాణాలను తృణప్రాయంగా వదిలేయడం బాధాకరం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement