
నెల్లూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ బాధ్యతల నుంచి తొలగింపు
సాక్షి, నెల్లూరు: లైంగిక వేధింపుల ఘటనలో నెల్లూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ బాధ్యతల నుంచి ప్రభాకర్‌ను తొలగించారు. తిరుపతి రుయా ఆసుపత్రికి ఆయనను బదిలీ చేశారు. కాగా జీజీహెచ్ ఘటనపై రెండు కమిటీలు విచారణ చేపట్టిన సంగతి విదితమే. డీఎంఈ త్రిసభ్య కమిటీ, డిస్ట్రిక్ట్ త్రిసభ్య కమిటీలు లైంగిక వేధింపుల ఘటనపై లోతుగా దర్యాప్తు చేశాయి. ఈ క్రమంలో ప్రభుత్వానికి నివేదిక సమర్పించగా.. ఆయనను నెల్లూరు జీజీహెచ్ బాధ్యతల నుంచి తొలగించారు.
కాగా, ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయిన సంగతి తెలిసిందే. లైంగిక వేధింపులపై మహిళా కమిషన్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. సూపరింటెండెంట్ లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణ జరిపి పూర్తి నివేదిక ఇవ్వాలని మంత్రి ఆళ్ల నాని శుక్రవారం ఆదేశించారు. విచారణ చేపట్టిన రెండు కమిటీలు.. ప్రభుత్వానికి నివేదిక సమర్పించాయి.
చదవండి: టెన్త్ పరీక్షలు రద్దు చేయం: మంత్రి సురేష్
విమర్శలు చేయడమే పనిగా పెట్టుకోవద్దు: టీటీడీ ఈవో