సాక్షి, విజయవాడ: ప్రభుత్వాసుపత్రి మార్చురీ వద్ద దుర్భర పరిస్థితి నెలకొంది. మృతదేహాల కోసం కుటుంబీకులు పడిగాపులు కాస్తున్నారు. వరదల కారణంగా చనిపోయిన వారి మృతదేహాలు మార్చురీకి తరలించగా, వరద నీటిలో ఉన్న మృతదేహాలను మార్చురీకి తీసుకురావడంలోనూ చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది.
సీఎం చంద్రబాబుకు చెప్పుకుంటే కానీ మృతదేహాలను తరలించేందుకు ప్రభుత్వ యంత్రాంగం సహకరించడం లేదు. ప్రస్తుతం విజయవాడ ప్రభుత్వాసుపత్రి మార్చురీలో 12 మృతదేహాలు ఉండగా, రెండు రోజుల నుంచి మృతదేహాల కోసం మార్చురీవద్దే కుటుంబీలు నిరీక్షిస్తున్నారు. పోస్టు మార్టం ప్రక్రియ పూర్తిచేసి ఇచ్చేందుకు అధికారులు, పోలీసులు జాప్యం చేస్తున్నారు.
కాగా, బాధితుల ఆర్తనాదాలు అరణ్య రోదనగానే మిగిలిపోతున్నాయి. మూడ్రోజులుగా గల్లంతైన వారు శవాలుగా మారి నీటిలో కొట్టుకుపోతూ కనిపిస్తున్న దృశ్యాలు అత్యంత హృదయ విదారకంగా మారాయి. వరదల గురించి ముందుగా అప్రమత్తం చేయడంలో విఫలమైన ప్రభుత్వం.. కనీసం గల్లంతైన వారి ఆచూకీ అయినా చెబుతుందేమోన్న బాధిత కుటుంబాల ఆశలపై నీళ్లు చల్లుతోంది.
మృతదేహాలు అలా కళ్లెదుటే వెళ్లిపోతున్నా, చంద్రబాబు సారధ్యంలోని ప్రభుత్వ యంత్రాంగం చేష్టలుడిగి చూస్తోంది. మృతదేహాలకు గౌరవంగా అంత్యక్రియలు నిర్వహించడం కనీస భారతీయ సంప్రదాయమనే విషయాన్ని విస్మరిస్తోంది. ఇప్పటిదాకా 32 మృతదేహాలు వెలుగుచూశాయి. మూడ్రోజులుగా ప్రజల మధ్యే ఉన్నప్పటికీ ఈ వాస్తవాలు దాచిపెట్టడం చంద్రబాబు దుర్మార్గానికి పరాకాష్ట.
Comments
Please login to add a commentAdd a comment