నిమ్స్ మార్చురీలోనే ఉదయకిరణ్ మృతదేహం
హైదరాబాద్: ఆత్మహత్య చేసుకున్న సినీహీరో ఉదయ్ కిరణ్ మృత దేహాన్ని ఈ రాత్రికి నిమ్స్ మార్చురీలోనే ఉంచాలని బంధువులు నిర్ణయించారు. శ్రీనగర్ కాలనీలోని జ్యోతి హోమ్స్ ఫ్లాట్ నంబర్ 402లో ఉదయ్ కిరణ్ రాత్రి 12:15 నిమిషాలకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. తొలుత మృతదేహాన్ని అపార్ట్మెంట్కు తరలించాలని అనుకున్నారు. అయితే అపార్ట్మెంట్లో నివాసం ఉండేవారు అందుకు అంగీకరించలేదు. అభిమానుల తాకిడి ఎక్కువగా ఉంటుందని వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతో మృత దేహాన్ని ఈ రాత్రికి మార్చురీలోనే ఉంచాలని అనుకున్నట్లు బంధువులు తెలిపారు. ఉదయ్ కిరణ్ సోదరి, బావ మస్కట్ నుంచి నిమ్స్‌కు చేరుకున్నారు.
రేపు ఉదయం 9.30 గంటలకు ఉదయ కిరణ్ మృత దేహాన్ని ఫిలిం ఛాంబర్‌కు తరలిస్తారు. సినీరంగం వారు, అభిమానుల సందర్శనార్ధం రెండు గంటలపాటు అక్కడ ఉంచుతారు. ఆ తరువాత ఎర్రగడ్డ స్మశానవాటికకు తరలించి, మధ్యాహ్నం అక్కడ అంత్యక్రియలు జరుపుతామని కుటుంబ సభ్యులు తెలిపారు.