కాపాడాల్సిన వాడే కాలయముడయ్యాడు.. | husband killed in wife and sons | Sakshi
Sakshi News home page

కాపాడాల్సిన వాడే కాలయముడయ్యాడు..

Published Thu, Jun 30 2016 12:58 AM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM

కాపాడాల్సిన వాడే కాలయముడయ్యాడు.. - Sakshi

కాపాడాల్సిన వాడే కాలయముడయ్యాడు..

విలపించిన మృతురాలి తల్లి
చిన్నారులను చంపడానికి వాడికి చేతులెలా వచ్చాయయ్యా...

గొంతు నులిమి...ఆపై పట్టాలపై పడవేసి
► బుడంపాడు వద్ద ఓ కన్నతండ్రి ఘాతుకం



గుంటూరు రూరల్  :  జీవితాంతం తోడూ నీడగా ఉంటానని పెళ్లిరోజు చేసిన ప్రమాణానికి పాతరేశాడు.. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్న బిడ్డలను కడతేర్చాడు. భార్యా, బిడ్డలను దారుణంగా హతమార్చి రైలు కింద ముక్కలు చేశాడు. హత్యలను ఆత్మహత్యలుగా చిత్రీకరించాలనే ప్రయత్నం బెడిసికొట్టడంతో అరండల్‌పేట పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు.. ఈ సంఘటనతో జిల్లా ప్రజలు ఉలిక్కిపడ్డారు. గుంటూరు శివారు బుడంపాడు గ్రామ పంచాయతీ శివారులోని గుంటూరు - తెనాలి రైల్వే లైన్ వద్ద పొన్నూరు మండలం పిట్టలవానిపాలేనికి చెందిన పేర్లీ రమేష్ భార్య, ఇద్దరు బిడ్డల్ని హతమార్చిన విషయం తెలిసిందే. గుంటూరు ప్రభుత్వాస్పత్రిలోని మార్చురీలో ఉన్న కుమార్తె నాగలక్ష్మి, మనవళ్ల మృతదేహాలను చూసి అనంతరం గుంటూరు జంక్షన్ రైల్వేస్టేషన్ నాలుగో ప్లాట్ ఫాం వద్దగల జీఆర్పీ పోలీస్‌స్టేషన్లో అమ్మమ్మ బాలమ్మ, బంధువులు ఫిర్యాదు చేశారు.

నెల రోజుల్లో పుట్టిన రోజు వేడుకలు చేయాలనుకుంటే పాడెక్కించాల్సి వచ్చిందయ్యా.. అంటూ బాలమ్మ విలపిస్తున్న తీరు చూసి అక్కడి వారికి కంటనీరు ఆగలేదు.. ఇంటికి వచ్చి దుస్తులు, బొమ్మలు కొనిస్తానంటూ మాయమాటలు చెప్పి తీసుకెళ్లి ఇంతటి దుర్మార్గానికి పాల్పడతాడని ఊహించలేదంటూ కన్నీటి పర్యంత మైంది. అల్లారు ముద్దుగా పెంచుకున్న ముద్దులొలికే చిన్నారులను చంపడానికి వాడికి చేతులెలా వచ్చాయయ్యా.. అంటూ ఆమె గుండెలు బాదుకుంది. పెళ్ళై ఏడాది గడవకముందే వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందనే కక్షతో మా అక్కను చిత్రహింసలకు గురిచేసేవాడు.. అని మృతురాలు నాగలక్ష్మి చెల్లెలు కుమారి విలపిస్తూ చెప్పింది. నేను  మారిపోయాను.. ముందుగా వేసుకున్న పథకం ప్రకారమే మా ఇంటికి వచ్చి మంచిగా నటించి మా అక్క, కొడుకులను తీసుకెళ్ళి కర్కశంగా హతమార్చాడని ఆమె విలపించిన తీరు అక్కడి వారిని కంటతడి పెట్టించింది.
 
 
 లొంగిపోయిన  నిందితుడు

పట్నంబజారు : భార్యతోపాటు ఇద్దరు పిల్లల్ని హతమార్చిన మృగాడు.. అరండల్‌పేట పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు తెలుస్తోంది. పోలీసులు విచారణలో హత్య చేసినట్లు అంగీకరించినట్లు సమాచారం.   మూడు సంవత్సరాల కిందట నల్లచెరువుకు చెందిన పేర్లి నాగలక్ష్మి (25)కి పిట్టలవానిపాలేనికి చెందిన రమేష్‌తో వివాహం జరిగింది. అయితే నాగలక్ష్మిపై అనుమానం ఉండటంతో ఏడాది కిందట విడిపోయినట్లు పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. రమేష్‌కూ వివాహేతర సంబంధం ఉందనే అనుమానం నాగలక్ష్మికీ ఉండటంతో వారి మధ్య తరచూ వివాదాలు జరుగుతుండేవి. ఈ క్రమంలో ఇద్దరూ ఏడాది కిందట విడిపోయారు. మృతురాలు నల్లచెరువులోని తల్లితండ్రుల వద్దనే ఉంటోంది. అయితే నిత్యం కాకాని తోటకు వెళ్లే అలవాటు ఉన్న నాగలక్ష్మిని మంగళవారం సాయత్రం కలిసిన రమేష్ ద్విచక్ర వాహనంపై భార్య, పిల్లల్ని ఎక్కిం చుకుని షాపింగ్‌కు అని నమ్మబలికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.

మాయమాటలు చెప్పి బుడంపాడులోని తెనాలి గుంటూరు రైల్వే ట్రాక్ వద్దకు తీసుకుని వెళ్లి రాయితో నాగలక్ష్మిని దారుణంగా కొట్టి చంపినట్లు విచారణలో ఒప్పుకున్నట్లు సమాచారం. అనంతరం చిన్నారులను గొంతు నులి మి కిరాతకంగా చంపినట్లు అంగీకరించినట్లు తెలిసింది. నిందితుడు రమేష్‌ను గవర్నమెంట్ రైల్వే పోలీసులకు అప్పగించేందుకు అరండల్‌పేట పోలీసులే సిద్ధమవుతున్నారు.       

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement