మధ్యప్రదేశ్: డెబ్బై ఏళ్ల వృద్ధుడు మృతి చెందాడని వైద్యులు నిర్ధారించి రాత్రంతా మార్చురీలో ఉంచిన ఘటన మధ్యప్రదేశ్‌లోని ఓ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కాశీరాం(72) అనే వృద్ధుడు గురువారం రోజు రోడ్డుపై స్పృహ తప్పిపడిపోయాడు.
స్థానికులు అతన్ని సాగర్ జిల్లాలోని బినా సివిల్ ఆస్పత్రికి తరలించగా డ్యూటీలో ఉన్న డాక్టర్ అతడు మృతి చెందినట్లు నిర్ధారించాడు. బాడీని రాత్రంతా మార్చురీలో (మృతదేహాలను ఉంచే గది) ఉంచారు. ఆ వృద్ధుడి మృత దేహాన్ని మర్చురీ ఉంచినట్లు పోలీసులకు తెలిపారు.
పోస్ట్‌మార్టమ్ నిమిత్తం పోలీసులు శుక్రవారం ఉదయం అస్పత్రిలోని మార్చురీలో ఉన్న మృతదేహాన్ని పరిశీలించగా.. అతడు బతికే ఉన్నట్లు తేలింది. ఈ క్రమంలో కంగుతిన్న డ్యూటీ డాక్టర్ బతికున్న ఆ వృద్ధుడికి చికిత్స అందించారు. అయినప్పటికినీ అతను కొంత సమయం పాటు చికిత్స పొంది..మృతి చెందాడు. విచారణలో భాగంగా ..ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఈ నెల 14న ఆస్పత్రికి వచ్చాడని తేలిసింది.
‘వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే వృద్ధుడు మరణించాడని, ఈ విషయాన్ని జిల్లా పాలనా యంత్రాంగానికి చేరవేస్తూ.. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసు ఉన‍్నతాధికారి తెలిపారు. ఆస్పత్రి ప్రధాన వైద్యాధికారి మాట్లాడుతూ.. ‘ఈ విషయంపై ఎంక్వైరీ నిర్వహించి, డ్యూటీలో ఉన్న డాక్టర్‌ను వెంటనే గుర్తించి మోమో జారీ చేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment