old men dead
-
బతికేవున్నా.. చచ్చాడంటూ..
మధ్యప్రదేశ్: డెబ్బై ఏళ్ల వృద్ధుడు మృతి చెందాడని వైద్యులు నిర్ధారించి రాత్రంతా మార్చురీలో ఉంచిన ఘటన మధ్యప్రదేశ్‌లోని ఓ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కాశీరాం(72) అనే వృద్ధుడు గురువారం రోజు రోడ్డుపై స్పృహ తప్పిపడిపోయాడు. స్థానికులు అతన్ని సాగర్ జిల్లాలోని బినా సివిల్ ఆస్పత్రికి తరలించగా డ్యూటీలో ఉన్న డాక్టర్ అతడు మృతి చెందినట్లు నిర్ధారించాడు. బాడీని రాత్రంతా మార్చురీలో (మృతదేహాలను ఉంచే గది) ఉంచారు. ఆ వృద్ధుడి మృత దేహాన్ని మర్చురీ ఉంచినట్లు పోలీసులకు తెలిపారు. పోస్ట్‌మార్టమ్ నిమిత్తం పోలీసులు శుక్రవారం ఉదయం అస్పత్రిలోని మార్చురీలో ఉన్న మృతదేహాన్ని పరిశీలించగా.. అతడు బతికే ఉన్నట్లు తేలింది. ఈ క్రమంలో కంగుతిన్న డ్యూటీ డాక్టర్ బతికున్న ఆ వృద్ధుడికి చికిత్స అందించారు. అయినప్పటికినీ అతను కొంత సమయం పాటు చికిత్స పొంది..మృతి చెందాడు. విచారణలో భాగంగా ..ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఈ నెల 14న ఆస్పత్రికి వచ్చాడని తేలిసింది. ‘వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే వృద్ధుడు మరణించాడని, ఈ విషయాన్ని జిల్లా పాలనా యంత్రాంగానికి చేరవేస్తూ.. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. ఆస్పత్రి ప్రధాన వైద్యాధికారి మాట్లాడుతూ.. ‘ఈ విషయంపై ఎంక్వైరీ నిర్వహించి, డ్యూటీలో ఉన్న డాక్టర్‌ను వెంటనే గుర్తించి మోమో జారీ చేస్తామన్నారు. -
పాలివ్వని ఆవులు అమ్మారంటూ వృద్ధుడి హత్య..
జైపూర్ : పాలు సరిగ్గా ఇవ్వని ఆవులను అమ్మారంటూ 65 ఏళ్ల వృద్ధుడిని చితకబాదడంతో మరణించిన ఘటన రాజస్తాన్‌లో చోటుచేసుకుంది. ధనలాల్ గుజర్ అనే వ్యక్తి తనకు అమ్మిన ఆవు సరిగ్గా పాలు ఇవ్వడం లేదని ప్రకాష్ గుజర్ (30) కర్రతో దాడికి తెగబడటంతో బాధిత వృద్ధుడు మరణించిన ఘటన వరుణ్ జిల్లాలో వెలుగు చూసిందని పోలీసులు తెలిపారు. తీవ్ర గాయాలైన ధనలాల్‌ను జిల్లా ఆస్పత్రి నుంచి కోట ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడని పోలీసులు వెల్లడించారు.ధనలాల్ కుమారుడు ప్రకాష్ కుటుంబానికి కొన్ని ఆవులు విక్రయించగా, అవి సరిగ్గా పాలు ఇవ్వడం లేదని ఇరు కుటుంబాల మధ్య వాగ్వాదం చెలరేగి హత్యకు దారితీసిందని పోలీసులు తెలిపారు. నిందితుడు ప్రకాష్ గుజర్‌పై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు. -
అతిసారానికి అనూరులో ఒకరు మృతి
అనూరు(పెద్దాపురం) : అతిసారం మహమ్మారి గ్రామంలో ఒకరిని బలిగొంది. గ్రామానికి చెందిన పైడిమళ్ల ముసలయ్య (65) కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. అతిసారంతో ఈనెల ఐదవ తేదీన పెద్దాపురం ప్రభుత్వాస్పత్రిలో చేరిన ముసలయ్య పరిస్థితి విషమించడంతో కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వారం పాటు చికిత్స పొందిన ముసలయ్య మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడికి భార్య గోయమ్మ, కుమారులు నానాజీ, ఏసు, కుమార్తె ఉన్నారు. ముసలయ్య కుటుంబ సభ్యుల రోదన అందరినీ కలచివేసింది. మహమ్మారి మా నాన్న పొట్టన పెట్టుకుంది డయేరియా అంటే అందరిలా తగ్గుతుందనుకున్నాం. కానీ కలుషిత నీరు ప్రాణం తీస్తుందనుకోలేదు. –నానాజీ, ముసలయ్య కుమారుడు అతిసారం కారణం ఇప్పటికీ అంతు చిక్కలేదు గ్రామంలో డయేరియా కారణాలు ఇప్పటికీ అంతు చిక్కలేదు. వ్యాధి ప్రబలిన వెంటనే రోగులు తాగిన నీటికి పరీక్షలు నిర్వహించాం. అందులో ఏమీ లేదు. వారం రోజులుగా గ్రామంలో మంచినీటి సరఫరా నిలిపివేసి పెద్దాపురం నుంచి ట్యాంకర్ల ద్వారా గోదావరి నీటిని సరఫరా చేస్తున్నాం. అతిసారానికి ముసలయ్య మృతి చెందడం విచారకరం. ఆయన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకునేలా కృషి చేస్తాం. –అరవిందకుమార్, సర్పంచ్