![జేవీ రమణమూర్తి అంత్యక్రియలు పూర్తి - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/4/71466630093_625x300_0.jpg.webp?itok=35TQN3LI)
జేవీ రమణమూర్తి అంత్యక్రియలు పూర్తి
హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు జేవీ రమణమూర్తి అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య శుక్రవారం హైదరాబాద్ పంజాగుట్ట హిందూ శ్మశానవాటికలో జరిగాయి. ఉదయం అమీర్‌పేట్ నుంచి పంజాగుట్ట శ్మశానవాటిక వరకు అంతిమయాత్ర జరిగింది. ఆయన కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని జేవీ రమణమూర్తికి అంతిమ వీడ్కోలు పలికారు. శ్మశానవాటికలో ఆయన తనయుడు చితికి నిప్పంటించారు.