సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ సెకండ్ వేవ్ విషమించడంతో పరిస్థితి తీవ్ర ఆందోళనకంగా మారుతోంది. పాజిటివ్ కేసులు, కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య నిత్యం పెరిగిపోతుంది. ఒకవైపు కరోనా భయం ప్రజల్లో హడలెత్తిస్తుంటే మరోవైపు కరోనాతో ప్రాణాలు కోల్పోయిన వారికి అంత్యక్రియల నిర్వహణ కరవవుతోంది. తమ సొంత వారైనా బంధువులైనా కరోనాతో మరణిస్తే.. కనీసం చివరి చూపుకు కూడా రావడం లేదు.
ఇక కరోనా మృతుల దహన సంస్కారాలు నిర్వహించేందుకు అయితే పూర్తి వెనకడుగు వేస్తున్నారు. చనిపోయిన వారినుంచి కరోనా తమకు ఎక్కడ అంటుకుంటుందోనని భయంతో వెనకడుగు వేస్తున్నారు. దీంతో మున్సిపాలిటీ సిబ్బందే కరోనా శవాలకు అంత్యక్రియలు నిర్వహించాల్సి వస్తోంది.
ఈ నేపథ్యంలో కోవిడ్‌తో మరణించిన వారి అంత్యక్రియలు కూడా ఓ బిజినెస్‌గా మారింది. కోవిడ్ బాధిత మృతుల దహన సంస్కారాల సమస్యను పరిష్కరించేందుకు కొన్ని కార్పొరేట్ ఏజెన్సీలు రంగంలోకి దిగాయి. తగిన జాగ్రత్తలు తీసుకొని అంత్యక్రియలు నిర్వహించేందుకు ముందుకొస్తున్నాయి. కోవిడ్ సోకి ఎవరైనా చనిపోతే వారిని వ్యాన్‌లో తీసుకురావడం, దహన సంస్కారాలు.. ఇలా అన్ని పనులు వీరే చూసుకుంటారు. వీటన్నింటికి కలిసి ఓ స్పెషల్ ప్యాకేజీని అందిస్తున్నారు. వీటికి 30 వేల రూపాయల నుంచి 35 వేల వరకు వసూలు చేయనున్నారు. భారత్‌లోని దాదాపు ఏడు ప్రధాన నగరాల్లో వీరి సేవలు అందుబాటులో ఉన్నాయి.
చదవండి: తెలంగాణలో నైట్ కర్ఫ్యూ
ఆంథెస్టి అంత్యక్రియల సేవలు
ఆంథెస్టి ఫ్యూనరల్ సర్వీసెస్ ఈ ఏజెన్సీ చెన్నై, బెంగళూరు, జైపూర్,హైదరాబాద్ వంటి నగరాల్లో బ్రాంచ్‌లున్నాయి. అదే హైదరాబాద్‌లో అంత్యక్రియల కార్యక్రమం నిర్వహించేదుకు 32,000 వేల రూపాయలు వసూలు చేస్తుంది. వీరు సంప్రదాయం ప్రకారం అంతిమ సంస్కారాలన్నీ పూర్తి చేస్తారు. హాస్పిటల్ నుంచి డెడ్ బాడీని శ్మశానానికి తీసుకెళ్లడం. దహనం చేయడం. చితాభస్మాన్ని కుటుంబీకులకు అందజేయడం ఇలాంటివన్నీ నిర్వహిస్తారు.
వీరిలాగే హైదరాబాద్‌లోని ఫ్యునరల్ సేవ సర్వీసెస్ కూడా పనిచేస్తోంది. ఇది గోల్డ్, సిల్వర్ అంటు రెండు రకాల ప్యాకెజీలను అందిస్తోంది. ఇందుకు 30,000 వేల రూపాయలు తీసుకుంటున్నారు. అయితే కరోనా మరణాలు పెరిగిపోతుండటంతో స్మశానంలో స్థలం దొరకడం లేదని, తమ వ్యాపారం కష్టంగా మారుతోందని అంత్యక్రియల సేవల నిర్వహకులు చెబుతున్నారు. రోజుకి 6 నుంచి 10 కాల్స్ వస్తున్నాయని అంటున్నారు. ఏదేమైనా ఆత్మీయులు ‘దూరం’ అవుతున్న వేళ అంత్యక్రియలు నిర్వహించే ఆయా ఏజెన్సీలు అనాథ శవాల ఉదంతాలను తగ్గడానికి దోహద పడుతున్నాయనేది వాస్తవం.
Comments
Please login to add a commentAdd a comment