ఇడుపులపాయ, న్యూస్‌లైన్ : ఇడుపులపాయలోని ట్రిపుల్ ఐటీలో గురువారం సమ్మె సెరైన్ మోగింది. గురువారం ఉదయం ట్రిపుల్ ఐటీలోని పీయూసీ, బీటెక్ చదువుతున్న దాదాపు 8వేలమంది విద్యార్థులు ర్యాలీగా వచ్చి మెయిన్ రోడ్డులో ఉన్న రాజీవ్‌గాంధీ విగ్రహం వద్ద సమైక్యాంధ్ర కోసం పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి చెందుతుందని.. కేసీఆర్ డౌన్, డౌన్.. సోనియా మేలుకో అంటూ నినాదాలు చేశారు. శుక్రవారం విద్యార్థులు, ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలు ధరించి క్యాంపస్‌లో నిరసన వ్యక్తం చేస్తామని విద్యార్థులు పేర్కొన్నారు. రాష్ట్రం విడిపోతే రైతులకు, విద్యార్థులకు తీవ్ర అన్యా యం జరుగుతుందన్నారు. ఉద్యోగాల కోసం హైదరాబాద్‌ను పొరుగు ప్రాంతంగా భావించి వలస వెళ్లాల్సి వస్తుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
వీసీ ఆదేశానుసారం నిరసన
ట్రిపుల్ ఐటీ వీసీ రాజ్‌కుమార్ ఆదేశానుసారం గురువారం నిరసన కార్యక్రమం చేపట్టాం. ఈ నిరసనను శుక్రవారం నల్లబ్యాడ్జీలతో ప్రదర్శిస్తాం. తదుపరి వీసీ ఆదేశానుసారం తమ కార్యక్రమాలు వెల్లడిస్తాం.
- కె.ఎల్.ఎన్.రెడ్డి, ప్రొఫెసర్
సమైక్యంగా ఉంటేనే..
రాష్ట్రం రెండుగా విడిపోతే సీమాంధ్ర ప్రాం తానికి చెందిన విద్యార్థులు ఉద్యోగావకాశాలు కోల్పోతాం. కావున రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే సుభిక్షం.
-మహాలక్ష్మి(పీ-2విద్యార్థిని),
గుంటూరు
కలిసుంటేనే అభివృద్ధి
రాష్ట్రం కలిసుం టేనే అభివృద్ధి చెందుతుంది. ఒకే భాష ఉన్న తెలుగు రాష్ట్రం విడిపోవడం చాలా బాధాకరం. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే కలిసి ఉంటేనే సుఖం.
- అనూష
(విద్యార్థిని), కరీంనగర్
మోగిన సమ్మె సైరన్
Published Fri, Sep 13 2013 3:03 AM | Last Updated on Fri, Sep 1 2017 10:39 PM
Advertisement