Rajiv gandhi Statue
-
రాష్ట్రంలో అసలు పాలనే లేదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోకి అధికారంలోకి వచి్చంది మొదలుకొని తొమ్మిది నెలలుగా తమ అధినేత కేసీఆర్‌ను దూషించడమే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పనిగా పెట్టుకున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. చరిత్ర తెలియని కొందరు సెపె్టంబర్ 17ను రాజకీయాల కోసం వక్రీకరించారన్నారు. రాష్ట్రంలో అసలు పాలనే లేదని, అయినా సెపె్టంబర్ 17ను సీఎం రేవంత్ ప్రజాపాలన దినోత్సవం పేరిట జరుపుతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ భవన్లో మంగళవారం కేటీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని తరలిస్తాం.. ‘తెలంగాణ తల్లి ఆత్మను అవమానిస్తూ సచివాలయం ఎదుట రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని పెట్టావు. ఇన్నిరోజులు సోనియాగాం«దీ, రాహుల్‌ను తిట్టిన రేవంత్ ఇప్పుడు దానిని కప్పి పుచ్చుకునేందుకు, ఢిల్లీ మెప్పు కోసం రాజీవ్ విగ్రహాన్ని పెట్టాడు. మేము అధికారంలోకి వచి్చన తర్వాత సకల మర్యాదలతో రాజీవ్ విగ్రహాన్ని గాం«దీభవన్‌కు తరలిస్తాం. రేవంత్‌కు అంత ఇష్టమైతే జూబ్లీహి ల్స్ ఇంట్లో రాజీవ్ విగ్రహం పెట్టుకోవాలి. గణేశ్ నిమజ్జనం రోజున రేవంత్‌కు చెబుతున్నా రాసిపెట్టుకో. రాజీవ్ విగ్రహం తొలగింపు కచి్చతంగా జరిగి తీరుతుంది’అని కేటీఆర్ ప్రకటించారు. హామీలు అమలు చేసేంతవరకు ప్రభుత్వం వెంటపడతాం ‘రాజీవ్ విగ్రహావిష్కరణ సందర్భంగా రేవంత్ మాట్లాడిన పనికిమాలిన మాటలను తెలంగాణ సమాజం అసహ్యించుకుంటోంది. రాష్ట్రంలో గంగాజమున తెహజీబ్‌ను కాపాడుతూ పదేళ్లపాటు తెలంగాణకు ఒక్క నొక్కు పడకుండా శాంతిభద్రతలను కేసీఆర్ కాపాడారు. రేవంత్‌కు చేతనైతే నాణ్యమైన విద్యుత్, రైతుబంధు, పెంచిన పెన్షన్లు, 2 లక్షల ఉద్యోగాలు తదితర హామీలను నెరవేర్చాలి. కానీ రేవంత్ డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నాడు. హామీలు అమలు చేసేంత వరకు ప్రభుత్వం వెంటపడతాం. తెలంగాణతల్లి విగ్రహానికి పాలాభిõÙకం చేసేందుకు వెళుతున్న బీఆర్ఎస్వీ విద్యార్థి నేతల అరెస్టు అక్రమం’అని కేటీఆర్ అన్నారు. జాతీయ సమైక్యత దిన వేడుకలు జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా కేటీఆర్ తెలంగాణభవన్‌లో జాతీయజెండాను ఎగురవేశారు. అంతకుముందు సచివాలయం ఎదుట రాజీవ్‌గాం«ధీ విగ్రహ ఏర్పాటుకు నిరసనగా పార్టీ పిలుపు మేరకు తెలంగాణభవన్‌లోని తెలంగాణ తల్లి విగ్రహానికి కేటీఆర్ పాలాభిõÙకం చేశారు. ఈ కార్యక్రమంలో మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు మహమూద్ అలీ, మల్లారెడ్డి, గంగుల కమలాకర్, శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాగంటి గోపీనాథ్, కాలేరు వెంకటేశ్, మాజీ ఎంపీ మాలోత్ కవిత, రాజీవ్ సాగర్, వాసుదేవరెడ్డి, రాకేశ్‌రెడ్డి, బాలరాజుయాదవ్ పాల్గొన్నారు. -
సోనియా స్వార్థానికి రాష్ట్ర విభజన
నెల్లూరు సిటీ, న్యూస్‌లైన్: కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తన స్వార్థ రాజకీయాల కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేసేందుకు ప్రయత్నిస్తోందని ఏపీ ఎన్జీఓ అ సోసియేష న్ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయవ ర్మ, వైస్ ప్రెసిడెంట్ సుధాకర్‌రావు విమర్శించారు. రాష్ట్ర విభజనకు నిరసనగా స్థానిక ఎన్జీఓ హోం నుంచి దర్గామిట్టలోని రాజీవ్‌గాంధీ వి గ్రహం వరకు శనివారం ఎన్జీఓలు మోటార్‌సైకిల్ ర్యాలీ నిర్వహించారు. రాజీవ్‌గాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని వేడుకున్నారు. ‘నీ భార్య మనసు మార్చి సమైక్యాంధ్రకు కృషి చేయండి’ అని వేడుకున్నారు. జై సమైక్యాంధ్ర నినాదాలతో హోరెత్తించారు. కేసీఆర్ గద్ద బుద్ధులు మానుకో నిరసన ప్రదర్శనకు ముందుగా ఎన్జీఓలు కేసీఆర్ గద్దబుద్ధులు మానుకో అనే అనే ప్లెక్సీ ఆవిష్కరించారు. ఎన్జీఓ సంఘ నాయకులు మాట్లాడుతూ కేసీఆర్ రాష్ట్రాన్ని విభజించడం, కోడిపిల్లల వంటి సీమాంధ్రులను చంపుకు తినడం వంటి పనులు చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో శేఖరరావు, సతీష్‌బాబు, ప్రభాకర్‌రెడ్డి, శ్రీకాంత్‌రావు, రవికుమార్, శ్రీనివాసులురెడ్డి, శ్రీనివాసరాజు, గిరిధర్, మంజుల, అనూరాధ, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. -
మోగిన సమ్మె సైరన్
ఇడుపులపాయ, న్యూస్‌లైన్ : ఇడుపులపాయలోని ట్రిపుల్ ఐటీలో గురువారం సమ్మె సెరైన్ మోగింది. గురువారం ఉదయం ట్రిపుల్ ఐటీలోని పీయూసీ, బీటెక్ చదువుతున్న దాదాపు 8వేలమంది విద్యార్థులు ర్యాలీగా వచ్చి మెయిన్ రోడ్డులో ఉన్న రాజీవ్‌గాంధీ విగ్రహం వద్ద సమైక్యాంధ్ర కోసం పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి చెందుతుందని.. కేసీఆర్ డౌన్, డౌన్.. సోనియా మేలుకో అంటూ నినాదాలు చేశారు. శుక్రవారం విద్యార్థులు, ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలు ధరించి క్యాంపస్‌లో నిరసన వ్యక్తం చేస్తామని విద్యార్థులు పేర్కొన్నారు. రాష్ట్రం విడిపోతే రైతులకు, విద్యార్థులకు తీవ్ర అన్యా యం జరుగుతుందన్నారు. ఉద్యోగాల కోసం హైదరాబాద్‌ను పొరుగు ప్రాంతంగా భావించి వలస వెళ్లాల్సి వస్తుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. వీసీ ఆదేశానుసారం నిరసన ట్రిపుల్ ఐటీ వీసీ రాజ్‌కుమార్ ఆదేశానుసారం గురువారం నిరసన కార్యక్రమం చేపట్టాం. ఈ నిరసనను శుక్రవారం నల్లబ్యాడ్జీలతో ప్రదర్శిస్తాం. తదుపరి వీసీ ఆదేశానుసారం తమ కార్యక్రమాలు వెల్లడిస్తాం. - కె.ఎల్.ఎన్.రెడ్డి, ప్రొఫెసర్ సమైక్యంగా ఉంటేనే.. రాష్ట్రం రెండుగా విడిపోతే సీమాంధ్ర ప్రాం తానికి చెందిన విద్యార్థులు ఉద్యోగావకాశాలు కోల్పోతాం. కావున రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే సుభిక్షం. -మహాలక్ష్మి(పీ-2విద్యార్థిని), గుంటూరు కలిసుంటేనే అభివృద్ధి రాష్ట్రం కలిసుం టేనే అభివృద్ధి చెందుతుంది. ఒకే భాష ఉన్న తెలుగు రాష్ట్రం విడిపోవడం చాలా బాధాకరం. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే కలిసి ఉంటేనే సుఖం. - అనూష (విద్యార్థిని), కరీంనగర్ -
అయ్యో ‘పాప’ం!
మారేడుపల్లి, న్యూస్‌లైన్: ఆ తల్లి ఏ తప్పు చేసిందో.. లేక ఏ కష్టమొచ్చిందో.. ఆడబిడ్డ అని తెలిసి పెంచే స్తోమత లేక వదిలించుకోవాలనుకుందో పాపం.. అప్పుడే పుట్టిన బొడ్డూడని ఆడబిడ్డను చెత్తకుండీ పాలు చేసింది. వీధి కుక్కులకు ఆహారం అవ్వాల్సిన ఆ శిశువు ఇద్దరు మావనతామూర్తుల సాయంతో బతికి బట్టకట్టింది. వివరాలిలా ఉన్నాయి. కార్ఖానా పోలీసుస్టేషన్ పరిధిలోని వాసవినగర్‌లోని కమ్యూనిటీహాల్ ఎదురుగా అక్కడే వున్న గాంధీ విగ్రహం సాక్షిగా చెత్త కుప్పలో గురువారం ఓ ఆడ పసికందును పడేసి వెళ్లింది ఓ తల్లి. అక్కడే కాస్త దూరంలో పారిశుద్ధ్య విధులు నిర్వహిస్తున్న ఓ కార్మికురాలు అక్కడి చెత్త వేయడానికి వచ్చి చూడగా పసిబిడ్డ బట్టలో చుట్టి అగుపడింది. ఈ విషయాన్ని స్థానికులకు తెలిపింది. విషయం తెలుసుకున్న స్థానిక సామాజిక సేవా కార్యకర్త తేలుకుంట సతీష్‌కుమార్ గుప్తా సంఘటనా స్థలానికి వ చ్చారు. సహాయక చర్యలు చేపట్టి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడే సమీపంలో టిఫిన్ సెంటర్ నిర్వహిస్తున్న వై. మహేశ్వరి సాయంతో పసికందును కట్టి ఉన్న ప్టాస్టిక్ కవరును తొలగించగా ఆ శిశువు కెవ్వున ఏడ్చింది. హమ్మయ్య.....పాప బతికే ఉందని అంతా అనందించారు. ఈ లోపు కార్ఖానా రక్షక్ వాహనం అక్కడికి చేరుకోగానే ఆ ఆడశిశువును సతీష్‌కుమార్ విక్రమ్‌పురిలో ఉన్న రెయిన్బో ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్సలు నిర్వహించి నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు. ప్రసుత్తం ఆ చిన్నారి క్షేమంగా ఉంది.