సోనియా స్వార్థానికి రాష్ట్ర విభజన | Sonia gandhi selfish state Division | Sakshi
Sakshi News home page

సోనియా స్వార్థానికి రాష్ట్ర విభజన

Published Mon, Sep 16 2013 4:37 AM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM

Sonia gandhi selfish state Division

నెల్లూరు సిటీ, న్యూస్‌లైన్: కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తన స్వార్థ రాజకీయాల కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేసేందుకు ప్రయత్నిస్తోందని ఏపీ ఎన్‌జీఓ అ సోసియేష న్ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయవ ర్మ, వైస్ ప్రెసిడెంట్ సుధాకర్‌రావు విమర్శించారు. రాష్ట్ర విభజనకు నిరసనగా స్థానిక ఎన్‌జీఓ హోం నుంచి దర్గామిట్టలోని రాజీవ్‌గాంధీ వి గ్రహం వరకు శనివారం ఎన్‌జీఓలు మోటార్‌సైకిల్ ర్యాలీ నిర్వహించారు. రాజీవ్‌గాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని వేడుకున్నారు. ‘నీ భార్య మనసు మార్చి సమైక్యాంధ్రకు కృషి చేయండి’ అని  వేడుకున్నారు. జై సమైక్యాంధ్ర నినాదాలతో హోరెత్తించారు.
 
 కేసీఆర్ గద్ద బుద్ధులు మానుకో
 నిరసన ప్రదర్శనకు ముందుగా ఎన్‌జీఓలు కేసీఆర్ గద్దబుద్ధులు మానుకో అనే అనే ప్లెక్సీ ఆవిష్కరించారు. ఎన్‌జీఓ సంఘ నాయకులు మాట్లాడుతూ కేసీఆర్ రాష్ట్రాన్ని విభజించడం, కోడిపిల్లల వంటి సీమాంధ్రులను చంపుకు తినడం వంటి పనులు చేస్తున్నారని విమర్శించారు.
 ఈ కార్యక్రమంలో శేఖరరావు, సతీష్‌బాబు, ప్రభాకర్‌రెడ్డి, శ్రీకాంత్‌రావు, రవికుమార్, శ్రీనివాసులురెడ్డి, శ్రీనివాసరాజు, గిరిధర్, మంజుల, అనూరాధ, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement