ఢిల్లీ మెప్పు కోసమే సచివాలయం ఎదుట రాజీవ్ విగ్రహం
తొమ్మిది నెలలుగా కేసీఆర్‌ను దూషిస్తూ
టైమ్ పాస్ చేశారు... రేవంత్ తీరును తెలంగాణ సమాజం అసహ్యించుకుంటోంది
జాతీయ సమైక్యతా దినోత్సవంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోకి అధికారంలోకి వచి్చంది మొదలుకొని తొమ్మిది నెలలుగా తమ అధినేత కేసీఆర్‌ను దూషించడమే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పనిగా పెట్టుకున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. చరిత్ర తెలియని కొందరు సెపె్టంబర్ 17ను రాజకీయాల కోసం వక్రీకరించారన్నారు. రాష్ట్రంలో అసలు పాలనే లేదని, అయినా సెపె్టంబర్ 17ను సీఎం రేవంత్ ప్రజాపాలన దినోత్సవం పేరిట జరుపుతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం కేటీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడారు.
రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని తరలిస్తాం..
‘తెలంగాణ తల్లి ఆత్మను అవమానిస్తూ సచివాలయం ఎదుట రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని పెట్టావు. ఇన్నిరోజులు సోనియాగాం«దీ, రాహుల్‌ను తిట్టిన రేవంత్ ఇప్పుడు దానిని కప్పి పుచ్చుకునేందుకు, ఢిల్లీ మెప్పు కోసం రాజీవ్ విగ్రహాన్ని పెట్టాడు. మేము అధికారంలోకి వచి్చన తర్వాత సకల మర్యాదలతో రాజీవ్ విగ్రహాన్ని గాం«దీభవన్‌కు తరలిస్తాం. రేవంత్‌కు అంత ఇష్టమైతే జూబ్లీహి ల్స్ ఇంట్లో రాజీవ్ విగ్రహం పెట్టుకోవాలి. గణేశ్ నిమజ్జనం రోజున రేవంత్‌కు చెబుతున్నా రాసిపెట్టుకో. రాజీవ్ విగ్రహం తొలగింపు కచి్చతంగా జరిగి తీరుతుంది’అని కేటీఆర్ ప్రకటించారు.
హామీలు అమలు చేసేంతవరకు ప్రభుత్వం వెంటపడతాం
‘రాజీవ్ విగ్రహావిష్కరణ సందర్భంగా రేవంత్ మాట్లాడిన పనికిమాలిన మాటలను తెలంగాణ సమాజం అసహ్యించుకుంటోంది. రాష్ట్రంలో గంగాజమున తెహజీబ్‌ను కాపాడుతూ పదేళ్లపాటు తెలంగాణకు ఒక్క నొక్కు పడకుండా శాంతిభద్రతలను కేసీఆర్ కాపాడారు. రేవంత్‌కు చేతనైతే నాణ్యమైన విద్యుత్, రైతుబంధు, పెంచిన పెన్షన్లు, 2 లక్షల ఉద్యోగాలు తదితర హామీలను నెరవేర్చాలి. కానీ రేవంత్ డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నాడు. హామీలు అమలు చేసేంత వరకు ప్రభుత్వం వెంటపడతాం. తెలంగాణతల్లి విగ్రహానికి పాలాభిõÙకం చేసేందుకు వెళుతున్న బీఆర్‌ఎస్‌వీ విద్యార్థి నేతల అరెస్టు అక్రమం’అని కేటీఆర్ అన్నారు.
జాతీయ సమైక్యత దిన వేడుకలు
జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా కేటీఆర్ తెలంగాణభవన్‌లో జాతీయజెండాను ఎగురవేశారు. అంతకుముందు సచివాలయం ఎదుట రాజీవ్‌గాం«ధీ విగ్రహ ఏర్పాటుకు నిరసనగా పార్టీ పిలుపు మేరకు తెలంగాణభవన్‌లోని తెలంగాణ తల్లి విగ్రహానికి కేటీఆర్ పాలాభిõÙకం చేశారు. ఈ కార్యక్రమంలో మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు మహమూద్ అలీ, మల్లారెడ్డి, గంగుల కమలాకర్, శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాగంటి గోపీనాథ్, కాలేరు వెంకటేశ్, మాజీ ఎంపీ మాలోత్ కవిత, రాజీవ్ సాగర్, వాసుదేవరెడ్డి, రాకేశ్‌రెడ్డి, బాలరాజుయాదవ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment