National Unity day
-
రాష్ట్రంలో అసలు పాలనే లేదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోకి అధికారంలోకి వచి్చంది మొదలుకొని తొమ్మిది నెలలుగా తమ అధినేత కేసీఆర్‌ను దూషించడమే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పనిగా పెట్టుకున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. చరిత్ర తెలియని కొందరు సెపె్టంబర్ 17ను రాజకీయాల కోసం వక్రీకరించారన్నారు. రాష్ట్రంలో అసలు పాలనే లేదని, అయినా సెపె్టంబర్ 17ను సీఎం రేవంత్ ప్రజాపాలన దినోత్సవం పేరిట జరుపుతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ భవన్లో మంగళవారం కేటీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని తరలిస్తాం.. ‘తెలంగాణ తల్లి ఆత్మను అవమానిస్తూ సచివాలయం ఎదుట రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని పెట్టావు. ఇన్నిరోజులు సోనియాగాం«దీ, రాహుల్‌ను తిట్టిన రేవంత్ ఇప్పుడు దానిని కప్పి పుచ్చుకునేందుకు, ఢిల్లీ మెప్పు కోసం రాజీవ్ విగ్రహాన్ని పెట్టాడు. మేము అధికారంలోకి వచి్చన తర్వాత సకల మర్యాదలతో రాజీవ్ విగ్రహాన్ని గాం«దీభవన్‌కు తరలిస్తాం. రేవంత్‌కు అంత ఇష్టమైతే జూబ్లీహి ల్స్ ఇంట్లో రాజీవ్ విగ్రహం పెట్టుకోవాలి. గణేశ్ నిమజ్జనం రోజున రేవంత్‌కు చెబుతున్నా రాసిపెట్టుకో. రాజీవ్ విగ్రహం తొలగింపు కచి్చతంగా జరిగి తీరుతుంది’అని కేటీఆర్ ప్రకటించారు. హామీలు అమలు చేసేంతవరకు ప్రభుత్వం వెంటపడతాం ‘రాజీవ్ విగ్రహావిష్కరణ సందర్భంగా రేవంత్ మాట్లాడిన పనికిమాలిన మాటలను తెలంగాణ సమాజం అసహ్యించుకుంటోంది. రాష్ట్రంలో గంగాజమున తెహజీబ్‌ను కాపాడుతూ పదేళ్లపాటు తెలంగాణకు ఒక్క నొక్కు పడకుండా శాంతిభద్రతలను కేసీఆర్ కాపాడారు. రేవంత్‌కు చేతనైతే నాణ్యమైన విద్యుత్, రైతుబంధు, పెంచిన పెన్షన్లు, 2 లక్షల ఉద్యోగాలు తదితర హామీలను నెరవేర్చాలి. కానీ రేవంత్ డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నాడు. హామీలు అమలు చేసేంత వరకు ప్రభుత్వం వెంటపడతాం. తెలంగాణతల్లి విగ్రహానికి పాలాభిõÙకం చేసేందుకు వెళుతున్న బీఆర్ఎస్వీ విద్యార్థి నేతల అరెస్టు అక్రమం’అని కేటీఆర్ అన్నారు. జాతీయ సమైక్యత దిన వేడుకలు జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా కేటీఆర్ తెలంగాణభవన్‌లో జాతీయజెండాను ఎగురవేశారు. అంతకుముందు సచివాలయం ఎదుట రాజీవ్‌గాం«ధీ విగ్రహ ఏర్పాటుకు నిరసనగా పార్టీ పిలుపు మేరకు తెలంగాణభవన్‌లోని తెలంగాణ తల్లి విగ్రహానికి కేటీఆర్ పాలాభిõÙకం చేశారు. ఈ కార్యక్రమంలో మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు మహమూద్ అలీ, మల్లారెడ్డి, గంగుల కమలాకర్, శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాగంటి గోపీనాథ్, కాలేరు వెంకటేశ్, మాజీ ఎంపీ మాలోత్ కవిత, రాజీవ్ సాగర్, వాసుదేవరెడ్డి, రాకేశ్‌రెడ్డి, బాలరాజుయాదవ్ పాల్గొన్నారు. -
టీఆర్ఎస్లో రచ్చరచ్చ.. పిడిగుద్దులు గుద్దుకుంటూ హల్చల్
శాంతినగర్: జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు అధికార పార్టీలో రగడకు దారితీశాయి. జోగుళాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీ శాంతినగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఆర్డీఓ రాములు అధ్యక్షతన శుక్రవారం వజ్రోత్సవాలు నిర్వహించారు. జెడ్పీ చైర్పర్సన్ సరిత, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్, ఎమ్మెల్యే అబ్రహం హాజరయ్యారు. ఈ సందర్బంగా కొందరు సెల్ఫీలు, ఫొటోలు తీసుకుంటుండగా వేదికపై అలజడి రేగింది. ఒకరిపైఒకరు పిడిగుద్దులు గుద్దుకుంటూ హల్చల్ చేశారు. సభాప్రాంగణం అరుపులు, కేకలతో దద్దరిల్లింది. అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనతో అప్రమత్తమైన పోలీసులు రంగంలోకి దిగి సాయిచంద్, ఆయన అనుచరులు, గన్‌మెన్, పీఏలను ఒకవైపు.. ఎమ్మెల్యే అబ్రహం తన యుడు అజయ్, అతడి అనుచరులను మరోవైపు పంపించి గొడవ పెద్దది కాకుండా చూశారు. అనంతరం సాయిచంద్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే కుమారుడు అజయ్ అనుచరులు తనపై, పీఏ, గన్‌మెన్‌పై దాడికి పాల్పడ్డారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అక్కడే బైఠాయించారు. దీంతో పోలీసులు ఆయనకు నచ్చజెప్పి పోలీసు ఎస్కార్ట్‌తో అక్కడి నుంచి పంపించారు. దాడి ఘటనను సీఎం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. అయితే, సాయిచంద్ ఎవరి ఆహా్వనం మేరకు వచ్చారని ఎమ్మెల్యే తనయుడు అజయ్ ప్రశ్నించారని, ఈ క్రమంలో మాటామాటా పెరిగి దాడులు చేసుకునే వరకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: జాతీయ సమైక్యత ర్యాలీలో అపశ్రుతి -
పార్లమెంట్ ఆవరణలో రాష్ట్రీయ ఏక్తా దివస్
-
ఆర్టికల్ 370 రద్దు పటేల్‌కు అంకితం
కెవాడియ: కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి ఉగ్రవాదానికి ద్వారాలు తెరవడం తప్ప ఇంకేం చేయలేదని ప్రధాని మోదీ అన్నారు. అందుకే ఆర్టికల్ 370 రద్దు చేశామని స్పష్టం చేశారు. భారత తొలి హోంమంత్రి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జన్మదినమైన జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకొని పటేల్ ఐక్యతా విగ్రహం వద్ద మోదీ నివాళులర్పించారు. ఆర్టికల్ 370 రద్దు నిర్ణయాన్ని పటేల్‌కు అంకితమిస్తున్నానని ప్రకటించారు. పటేల్ 144వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి ప్రసంగించిన మోదీ ‘జాతీయ ఐక్యతా ప్రతిజ్ఞ’ చేశారు. భిన్నత్వంలో ఏకత్వం భారత దేశ సమగ్రతకు చిహ్నమని, ఈ దేశానికి గర్వకారణమనీ మోదీ అన్నారు. కశ్మీర్ ఉగ్రవాదం కారణంగా మూడు దశాబ్దాల్లో 40,000 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘యుద్ధంలో గెలవలేని వాళ్ళు’’ వేర్పాటు వాదంతో, ఉగ్రవాదంతో ఈ దేశ సమగ్రతను దెబ్బతీయాలని చూస్తున్నారనీ పాకిస్తాన్‌ని ఉద్దేశించి మోదీ వ్యాఖ్యానించారు. అయితే శతాబ్దాలుగా వారా ప్రయత్నం చేస్తున్నా ఈ దేశాన్ని జయించడం అసాధ్యమని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని జమ్మూ, కశ్మీర్, లదాఖ్‌గా విడగొట్టడం ఈ ప్రాంత ప్రజల మధ్య బలమైన విశ్వాసాన్ని పాదుకొల్పాలన్న లక్ష్యమే తప్ప ప్రాంతాల మధ్య విభజనరేఖను గీయాలన్న ఉద్దేశ్యం లేదన్నారు. కశ్మీర్ సమస్యను తాను డీల్ చేసినట్టయితే సమస్య పరిష్కారానికి ఇంతకాలం పట్టేది కాదన్న పటేల్ వ్యాఖ్యానాన్ని ప్రస్తావించారు. ఏపీ సీఎం జగన్ నివాళి సాక్షి, అమరావతి: వల్లభ్‌భాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. పటేల్ మహనీయుడు ధృఢ దీక్షతో సమైక్య భారతదేశం రూపుదిద్దుకోవడంలో చేసిన కృషిని దేశ ప్రజలు ఎన్నటికీ మరువరని, సర్వదా ఆయనకు రుణపడి ఉంటారని ట్విట్టర్ వేదికగా సీఎం జగన్ శ్లాఘించారు. -
పటేల్ కృషి మరువలేనిది: డీజీపీ సవాంగ్
సాక్షి, విజయవాడ: జాతీయ సమైఖ్యతా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గురువారం ‘రన్ ఫర్ యూనిట్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్, కలెక్టర్ ఇంతియాజ్, సీసీ ద్వారక తిరుమలరావుతో పాటు లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ రవిశంకర్ హజరయ్యారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ ఈ సందర్బంగా పోలీసుల చేత దేశ సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉంటామంటూ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశాన్ని ఏకం చేయండంలో సర్ధార్ వల్లభాయ్ పటేల్ కృషి మరువలేనిదని అన్నారు. పోలీసులు కుడా వివిధ విభాగాల్లో కలిసి పనిచేయడం వల్ల మంచి పురోగతి సాధిస్తున్నారని, ప్రతి ఒక్కరూ ఐక్యంగా పనిచేస్తే ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు. కాగా విద్యార్ధి దశ నుంచే ఐక్యతా భావం పెంపోందించాలని ఆయన సూచించారు. అనంతరం బెంజిసర్కిల్ నుంచి సీఏఆర్ గ్రౌండ్ వరకు సాగనున్న సమైక్యత పరుగుకు డీజీపీ జెండా ఊపి రన్‌ను ప్రారంభించారు. ఈ సమైక్యత పరుగులో పోలీసులతో పాటు అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. ఇక సర్ధార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా జిల్లా ఎస్పీ రవీంద్రనాధ్ బాబు ‘ఏక్తా దినోత్సవం’ లో భాగంగా ‘రన్ ఫర్ యూనిట్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని పోలీసు పరేడ్ గ్రౌండ్ నుంచి కోనేరు సెంటరు వరకు ఈ ఐక్యత పరుగును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖులతో పాటు పెద్ద సంఖ్యలో విద్యార్థులు, యువకులు, ఉద్యోగులు, ప్రజలు పాల్గొన్నారు. -
పటేల్ తొలి ప్రధాని అయివుంటే ...
న్యూఢిల్లీ : దేశానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ తొలి ప్రధానమంత్రి అయ్యి ఉంటే దేశ పరిస్థితి మరో విధంగా ఉండేదని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. సర్దార్ పటేల్ జయంతి సందర్భంగా ఢిల్లీలోని విజయ్‌చౌక్ వద్ద ఏర్పాటు చేసిన జాతీయ ఐక్యత పరుగులో ఆయన శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ పటేల్ దేశ స్వాతంత్ర్యం కోసం త్యాగం చేసిన నేతల్లో మొట్ట మొదటి వ్యక్తి అన్నారు. మహాత్మాగాంధీకి నెహ్రు, పటేల్ రెండు కళ్లు, చెవుల్లా వ్యవహరించేవారన్నారు. అయితే గాంధీ మరణాంతరం పటేల్‌ను విస్మరించారని వెంకయ్య విమర్శించారు. దేశవ్యాప్తంగా జాతీయ ఐక్యతా పరుగు నిర్వహించి పటేల్‌ను మనం ఘనంగా స్మరించుకున్నామని ఆయన అన్నారు. మరోవైపు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి, ఇందిరాగాంధీ వర్థంతిపై కాంగ్రెస్, బీజేపీల మధ్య విమర్శల పర్వం కొనసాగుతోంది. పటేల్ జయంతిని జాతీయ ఏకతా దినోత్సవంగా ఘనంగా నిర్వహిస్తున్న కేంద్ర ప్రభుత్వం మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని మాత్రం విస్మరించిందని కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.