
సాక్షి, హైదరాబాద్ : వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు చిత్తుగా ఓడిపోవడం ఖాయమని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి రాజశేఖర్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు పాలనపై నలుగురు మాజీ సీఎస్‌లు ఆరోపణలు చేశారంటేనే ఎంతలా అవినీతి జరిగిందో అర్థమవుతుందన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తూ.. రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు చరిత్ర తెలుసుకుంటే ఆయన పక్కన ఎవరూ కూర్చోరని విమర్శించారు. ఒక్కసారి వామపక్షాలు, మరోసారి జనసేన, ఇంకోసారి బీజేపీ.. చివరగా కాంగ్రెస్‌తో కూడా పొత్తుకున్నారని, అవసరాల కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారుతారని ఎద్దేవా చేశారు.
ఉపాధి హామీ పనుల్లో రూ.7వేల కోట్లు చంద్రబాబు మింగేశారని ఆరోపించారు. రూ. 450కోట్ల విలువైన భూమిని తక్కువ ధరకే బినామిలకు ఇచ్చారన్నారు. చంద్రబాబు అవినీతిని కాగ్ నివేదిక బట్టబయలు చేసిందన్నారు. ఓటమి భయంతో నీచంగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడ్డారని విమర్శించారు. చంద్రబాబు, ఆయనతో నడిచే పార్టీలకు ప్రజలు తగిన శాస్తి చెబుతారని రాజశేఖర్ రెడ్డి వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment