పెద్దపల్లిఅర్బన్: ముఖ్యమంత్రిగా పాలనలో తనదైన ముద్రను వేసుకున్న దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డికి ప్రజల్లో ఆదరణ తగ్గలేదు. ఆయన సేవల్ని ఇప్పటికీ గుర్తుచేసుకుంటున్నారు. పెద్దపల్లి కలెక్టరేట్‌లో సోమవారం ప్రజావాణికి వచ్చిన పెద్దపల్లి మండలం రాగినేడుకు చెందిన యేల్పుల ఎల్లయ్య(80) దివంగత రాజశేఖరరెడ్డి పేదలకు చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. వృద్ధాప్య పింఛన్ కోసం అధికారుల చుట్టూ తిరిగి వేసారి కలెక్టర్‌కు మొర పెట్టుకుందామని వచ్చాడు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్నీ ఇచ్చిండు.. అడుగుడు ఆలస్యంలేదు పని చేసి పెట్టిండు..దొర ఎక్కడున్న సల్లంగుండాలే.. మల్ల గసొంటోడు రావాలె.. నాడు నెలనెలా ఠంచన్‌గా పింఛన్ అచ్చేది’అని దివంగత నేతను తలచుకుని కన్నీరుపెట్టుకున్నాడు. ‘కేసీఆర్ అచ్చి ఏం చేయలేదు.. బ్యాంకుల ఖాతా కావాలంటే తెరిచినా..అయినా పింఛన్ రాలే.. తెలంగాణ అచ్చిన మొదటి నుంచి న్యాయం జరగలేదు’అని అక్కసును వెల్లగక్కాడు.. అనంతరం కలెక్టర్ శ్రీదేవసేనకు వినతిపత్రం అందించాడు.
రాజన్న అన్నీ ఇచ్చిండు
Published Tue, Jan 9 2018 1:39 AM | Last Updated on Tue, Jan 9 2018 1:39 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment