సాక్షి, నిజామాబాద్: కనిపెంచిన తల్లి ఎప్పటికీ భారం కాదు. వృద్ధాప్యంలో ఆమెను జాగ్రత్తగా చూసుకోవడం తనయుల బాధ్యత. తన తల్లికి వృద్ధాప్య పింఛన్ అందడం లేదని ఓ కొడుకు ఆమెను భూజాలపై ఎత్తుకొని కలెక్టరేట్‌కు వచ్చాడు. కానీ సోమవారం ప్రజావాణికి లేనందున అధికారులు ఫిర్యాదులు స్వీకరించకపోవడంతో వారు నిరాశతో ఇలా వెనుతిరిగారు.
కోటగిరి మండలానికి చెందిన శాంతబాయి అనే వృద్ధురాలికి గత 14 సంవత్సరాలుగా పెన్షన్ రావడం లేదు. దీంతో ఆమె కొడుకు ఎన్నో సార్లు అధికారులను కలిసిన ఫలితం లేకుండా పోయింది. దీంతో ప్రజావాణిలో తన గోడును వెళ్లబోసుకుందామని వచ్చాడు. కానీ ప్రజావాణి రద్దుతో నిరాశ చెందారు.
Comments
Please login to add a commentAdd a comment