
సాక్షి,నిజామాబాద్: అమ్మకోసం లక్ష రూపాయల జీతం వదిలిపెట్టి తండ్రి స్కూటర్‌పై తల్లితో తీర్థయాత్రలకు బయలుదేరాడు ఓ కొడుకు. యాత్రలో భాగంగా సోమవారం తల్లీకొడుకులు నిజామాబాద్‌కు చేరుకున్నారు. కర్ణాటక రాష్ట్రం మైసూర్‌కు చెందిన దక్షిణామూర్తి కృష్ణకుమార్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసేవాడు. తల్లికి చిన్నప్పటి నుంచి దేశంలోని పుణ్య క్షేత్రాలన్నీ చూడాలని కోరిక.
దీంతో ఆమె కుమారుడు ఉద్యోగం వదులుకుని తండ్రి జ్ఞాపకార్థంగా ఉంచుకున్న స్కూటర్‌పై 2018 జనవరి 16న తీర్థయాత్ర మొదలుపెట్టాడు. ఇప్పటివరకు కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గడ్, జార్ఖండ్, పశి్చమ బంగ్లా, సిక్కిం, గోవా, కేరళ, మేఘలయా, త్రిపుర, మణిపూర్, మిజోరాం, నేపాల్, భూటాన్, మయన్మార్ దేశాలలో పుణ్యక్షేత్రాలను తల్లికి చూపించాడు. తల్లి కోరికను నెరవేరుస్తున్న కొడుకు ప్రేమను.. చూసిన వారు మెచ్చుకుంటున్నారు.
చదవండి: Love Marriage: మాచారెడ్డి అబ్బాయి వెడ్స్ అమెరికా అమ్మాయి
Comments
Please login to add a commentAdd a comment