ఈ సినిమా ఏంటో ఆ డైలాగ్‌ చెబుతోంది: మంత్రి నిరంజన్‌ రెడ్డి | Minister Niranjan Reddy Clap For First Scene Of The Movie | Sakshi
Sakshi News home page

ఈ సినిమా ఏంటో ఆ డైలాగ్‌ చెబుతోంది: మంత్రి నిరంజన్‌ రెడ్డి  

Published Mon, Nov 22 2021 9:06 AM | Last Updated on Mon, Nov 22 2021 9:23 AM

Minister Niranjan Reddy Clap For First Scene Of The Movie - Sakshi

‘‘నువ్వు గొప్పగా కల కనకపోతే ఎవరో కన్న కలలో నువ్వు బానిసవి అవుతావు’ అనే డైలాగ్‌ చాలా అద్భుతంగా ఉంది. ఈ డైలాగ్‌ ఈ సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందో చెబుతోంది’’ అని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సి.నిరంజన్‌ రెడ్డి అన్నారు. రామ్‌గౌడ, ప్రియాపాల్‌ జంటగా వీజే సాగర్‌ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది. సి.రవిసాగర్‌ నిర్మిస్తున్నారు.

తొలి సన్నివేశానికి మంత్రి నిరంజన్‌ రెడ్డి క్లాప్‌ ఇచ్చారు. ‘‘మంచి సందేశం ఇవ్వాలనే ఈ సినిమా నిర్మిస్తున్నాను’’ అన్నారు రవిసాగర్‌. ‘‘చిన్న పిల్లలు తల్లిదండ్రుల ప్రేమను ఎలా మిస్‌ అవుతున్నారు? పెద్దయ్యాక ఎలా తయారవుతున్నారు? అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిస్తున్నాం’’ అన్నారు వీజే సాగర్‌.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement