పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కాపవరం గ్రామ శివారులో ఇనుప కమ్మీల లోడుతో వెళుతున్న లారీలో ఇనుప చువ్వలు గుచ్చుకుని రమణ అనే కూలి మృతిచెందాడు.
పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కాపవరం గ్రామ శివారులో ఇనుప కమ్మీల లోడుతో వెళుతున్న లారీలో ఇనుప చువ్వలు గుచ్చుకుని రమణ అనే కూలి మృతిచెందాడు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన సోమవారం ఉదయం జరిగింది. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన ఆరుగురు కూలీలు కృష్ణా పుష్కరాల పనులకు వెళ్లేందుకు ఇనుప కమ్మీల లోడుతో వెళుతున్న లారీలో ఎక్కారు. కమ్మీలపై కూర్చుని ప్రయాణం చేస్తుండగా డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో కమ్మీలు గుండెలో గుచ్చుకుని రమణ అక్కడికక్కడే మృతిచెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. మిలిగిన నలుగురు క్షేమంగా బయటపడ్డారు.