లక్కిరెడ్డిపల్లె మండలం గద్దెగుండ్లరాచపల్లె మలుపు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో రామచంద్రనాయుడు(23), రమణ(22) అనే ఇద్దరు యువకులు మృతిచెందారు. బైక్‌పై స్వగ్రామం నుంచి రామాపురం మండలం హసనాపురానికి వెళ్తుండగా అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న ఓ ఇంటి గోడను ఢీకొట్టారు. తీవ్రగాయాలపాలైన రామచంద్రనాయుడు అక్కడికక్కడే మృత్యువాతపడగా. రమణ అనే మరో యువకుడు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. మరొకరి పరిస్థితి విషమంగా ఉండటంతో కడప రిమ్స్‌కు తరలించారు. మృతుల స్వగ్రామం లక్కిరెడ్డిపల్లె మండలం పాలెంచిన్నపోతులోల్లపల్లె. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి
Published Wed, Jul 20 2016 4:45 PM | Last Updated on Thu, Aug 30 2018 4:07 PM
Advertisement
Advertisement