పెళ్లి పీటలెక్కనున్న 'పల్సర్‌ బైక్‌' రమణ.. గ్రాండ్‌గా ఎంగేజ్‌మెంట్‌ | Pulsar Bike Ramana Engagement With Kundana Sree | Sakshi
Sakshi News home page

Pulsar Bike Ramana: గ్రాండ్‌గా పల్సర్‌ బైక్‌ సింగర్‌ నిశ్చితార్థం.. వీడియో షేర్‌ చేసిన రమణ

Published Thu, Jan 4 2024 3:00 PM | Last Updated on Thu, Jan 4 2024 4:48 PM

Pulsar Bike Ramana Engagement with Kundana Sree - Sakshi

పల్సర్‌ బైక్‌ సాంగ్‌తో ఫుల్‌ ఫేమస్‌ అయ్యాడు జానపద కళాకారుడు సింగర్‌ రమణ. ఈ పల్సర్‌ బైక్‌ సాంగ్‌ను రవితేజ ధమాకా మూవీలోనూ వాడేశారు. ఈ ఒక్కటేనా.. 'పొట్టిదాయి కాదమ్మో గట్టిదాయమ్మో..', 'వస్తావా.. భాను వస్తావా..' ఇలా ఎన్నో ఫోక్‌ సాంగ్స్‌ పాడాడు. బుల్లితెర షోలలో, ఈవెంట్లలో పాటలు పాడుతూ ఊహించని స్థాయిలో పాపులారిటీ తెచ్చుకున్నాడు. ఆ మధ్య బేబి 2 పేరుతో ఓ షార్ట్‌ ఫిలిం కూడా చేశాడు. తన జీవితంలో జరిగిన రియల్‌ బ్రేకప్‌ స్టోరీ ఆధారంగా ఈ లఘు చిత్రాన్ని తీసినట్లు తెలిపాడు. ఇకపోతే రమణ ఓ శుభవార్త చెప్పాడు.

త్వరలో పెళ్లి బంధంలోకి అడుగుపెట్టబోతున్నట్లు వెల్లడించాడు. డిసెంబర్‌ నెలాఖరులో అతడి ఎంగేజ్‌మెంట్‌ జరగ్గా.. అందుకు సంబంధించిన వీడియోను యూట్యూబ్‌లో రిలీజ్‌ చేశాడు. కుందన శ్రీ అనే అమ్మాయితో అతడి నిశ్చితార్థం జరిగింది. వీరిద్దరూ స్టేజీపై ఒకరికొకరు ఉంగరాలు మార్చుకుని ఫోటోలకు పోజిచ్చారు. పనిలో పనిగా ఎంగేజ్‌మెంట్‌ వేదికపైనే ప్రీవెడ్డింగ్‌ షూట్‌ కూడా పూర్తి చేసినట్లు కనిపిస్తోంది. ఇక ఈ వీడియో వైరల్‌గా మారగా కొత్త జంటకు అభిమానులు శుభాకాంక్షలు చెప్తున్నారు.

చదవండి: అమ్మ మరణం.. రోదిస్తూ గదిలోకి వెళ్లా.. ఎమోషనలైన శ్రీదేవి పెద్ద కూతురు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement