
అరోహి నాయుడు, సుధీర్
‘పైసామే పరమాత్మ’ అన్నది సామెత. ఇప్పుడు ‘పైసా పరమాత్మ’ అనే పేరుతో ఓ సినిమా రూపొందింది. సంకేత్, సుధీర్, క్రిష్ణ తేజ, రమణ, అనూష, అరోహి నాయుడు, బనీష ముఖ్య తారలుగా విజయ్ కిరణ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఇది. లక్ష్మీ సుచిత్ర క్రియేషన్స్ పతాకంపై టి.కిరణ్ కుమార్ నిర్మించిన ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. కిరణ్ కుమార్ మాట్లాడుతూ– ‘‘యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రమిది. కథపై నమ్మకంతో తెరకెక్కించాం. నేటి ట్రెండ్‌కి తగ్గట్టుగా విజయ్ కిరణ్ చక్కగా తీశారు. మా సినిమా మోషన్ పోస్టర్, ఫస్ట్‌లుక్‌కి మంచి స్పందన వచ్చింది’’ అన్నారు. ‘‘యూత్, ఫ్యామిలీస్ మెచ్చే ఆసక్తికర కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. కథనం హైలైట్‌గా ఉంటుంది. రామ్ పైడిశెట్టి సాహిత్యం, కనిష్క్ అందించిన సంగీతం సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయి’’ అని విజయ్ కిరణ్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment