స్వామివారి దర్శనానికి వచ్చిన వ్యక్తి గోదావరిలో గల్లంతయిన సంఘటన తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం అప్పనపల్లిలో ఆదివారం చోటుచేసుకుంది.
తూర్పుగోదావరి: స్వామివారి దర్శనానికి వచ్చిన వ్యక్తి గోదావరిలో గల్లంతయిన సంఘటన తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం అప్పనపల్లిలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామంలోని శ్రీ బాల బాలాజీ స్వామివారి ఆలయానికి వచ్చిన భక్తులు సమీపంలోని గోదావరి స్నానఘట్టంలో స్నానమాచరించడం ఆచారం. ఆదివారం ఉదయం తునికి చెందిన ఉండ రమణ(40) గోదావరిలో స్నానానికి దిగారు. ప్రమాదవశాత్తు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయారు. విషయం తెలుసుకున్న ఆలయ సహాయ సిబ్బంది అతని కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. సమాచారం అందుకున్న పోలీసులు సహాయ చర్యలు ముమ్మరం చేశారు. ఇంకా వివరాలు తెలియరావాల్సి ఉంది.
(మామిడికుదురు)