యర్రంశెట్టి రమణగౌతం రిమాండ్‌ | Ramana Goutham Remand in Cheating Case | Sakshi
Sakshi News home page

యువతిని మోసం చేసిన కేసులో సినీ రచయిత రిమాండ్‌

Published Thu, Jun 13 2019 7:46 AM | Last Updated on Thu, Jun 13 2019 7:46 AM

Ramana Goutham Remand in Cheating Case - Sakshi

రమణగౌతం

బంజారాహిల్స్‌: ప్రేమ పేరుతో సినీ నటిని మోసం చేసి పెళ్ళి చేసుకొని రాత్రికిరాత్రే ఉడాయించి విడాకుల పేరుతో కొత్త డ్రామాకు తెరతీసిన సినీ రచయితను బంజారాహిల్స్‌ పోలీసులు బుధవారం రిమాండ్‌కు తరలించారు. ఎస్‌ఐ బచ్చు శ్రీనివాస్‌ తెలిపిన వివరాల ప్రకారం... వైజాగ్‌ ఎంవీపీ కాలనీకి చెందిన యర్రంశెట్టి రమణగౌతం(27) సినిమాల్లో రచయితగా పని చేస్తుండగా బంజారాహిల్స్‌ రోడ్‌ నెం. 12లోని ఎన్బీటీ నగర్‌లో నివసిస్తున్న భవానీ సినిమాల్లో వేషాల్లో కోసం తిరుగుతుండగా పరిచయం అయింది. ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. నాలుగేళ్లు సహజీవనం చేశారు. పెళ్లి మాట ఎత్తేసరికి తప్పించుకు తిరుగుతున్న రమణగౌతంపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా అదే రోజు రాత్రి బంజారాహిల్స్‌లోని ఓ గుడిలో తాళికట్టాడు. పెళ్ళి జరిగిన గంటసేపటికే అక్కడి నుంచి ఉడాయించాడు. ఆ తెల్లవారి ఫోన్‌ చేసి రూ. 50 వేలు ఇస్తాను. విడాకులు ఇవ్వాలంటూ ఫోన్‌ చేశాడు. దీంతో బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పక్కా పథకం ప్రకారం పోలీసులు రమణగౌతంను మంగళవారం నారాయణగూడలో ఓ అడ్వకేట్‌ వద్దకు వస్తున్నప్పుడు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని అరెస్ట్‌చేశారు. చీటింగ్, అదనపు కట్నం వేధింపుల కేసులో బుధవారం నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. బంజారాహిల్స్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement