
సాక్షి, హైదరాబాద్: ఒత్తిడిలోనూ పీవీ సింధు విజయం సాధించిందని ఆమె తండ్రి రమణ అన్నారు. దేశం మొత్తం సింధుకు అండగా నిలిచిందన్నారు. దేశానికి పతకం సాధించడం గర్వంగా ఉందన్నారు. వరుసగా రెండు పతకాలు సాధించడం ఆనందంగా ఉందని తెలిపారు. నిన్నటి ఓటమి గురించి మరిచి.. ఈరోజు ఆటమీద దృష్టి పెట్టాలని చెప్పానని, వ్యక్తిగత ఈవెంట్‌లో దేశానికి రెండు మెడల్స్ తీసుకురావడం గర్వించదగ్గదన్నారు. సింధు పతకం సాధించడం ఆనందంగా ఉందని.. సింధు తల్లి విజయ అన్నారు. సింధు మ్యాచ్‌ను చివరి నిమిషం వరకు ఉత్కంఠగా చూశానని విజయ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment