మాట్లాడుతున్న వేణుగోపాల దీక్షితులు, కృష్ణ శేషాచల దీక్షితులు
తిరుమల: తిరుమలలో శ్రీవారి కైంకర్యాలు అన్నీ ఆగమోక్తంగానే నిర్వహిస్తున్నామని తిరుమల శ్రీ వారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు చెప్పారు. తిరుమలలోని అర్చక నిలయంలో ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు, కృష్ణశేషాచల దీక్షితులు గురువారం మీడియాతో మా ట్లాడుతూ.. టీటీడీ పరిపాలన, అధికారులు, స్వామి వారి ఆలయంపై రమణ దీక్షితులు చేసిన వ్యాఖ్యలను అర్చకులందరం ఖండిస్తున్నామని అన్నారు.
శ్రీవారి ఆలయంలో క్రమం తప్పకుండా అన్ని కైంకర్యాలు ఆగమోక్తంగానే జరుగుతు న్నాయని స్పష్టం చేశారు. పరిపాలన అంశాలు, అధికారులపై రమణ దీక్షితులు మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వచ్చిందన్నారు. శ్రీవారి ఆల యంలోకి స్తంభాలు తీసుకువచ్చారని, తవ్వకాలు జరిగాయంటూ ఆ వీడియోలో రమణ దీక్షితు లు చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం లేదని చెప్పారు. ఆ గమ సలహాదారులు, ప్రధాన అర్చకుల సూచనల మేర కు ఆలయంలో కైంకర్యాలన్నీ యథావిధిగా జరు గుతున్నాయని అన్నారు.
రమణ దీక్షితులు ఆగమ సలహా మండలి సభ్యుడుగా, ప్రధాన అర్చకులుగా ఉన్న సమయంలోనే ఆలయంలోని తిరుమలరా య మండపం, రంగ మండపం ప్రాంతాల్లో కుంగిపోయిన పైకప్పు, బలహీన పడిన స్తంభాలను పటిష్టపరిచారన్నారు. కొత్తగా ఆ ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలూ జరగలేదన్నారు. వంశపారంపర్యంగా సేవ చేసుకునే కుటుంబానికి చెందిన రమణ దీక్షితులు ఆలయ ప్రతిష్ట, వ్యవస్థపై అవాస్తవాలు మాట్లాడటం బాధాకరమని అన్నారు.
అవాస్తవాలు నమ్మకండి
భక్తులు ఇలాంటి అవాస్తవాలను నమ్మవద్దని, రమణ దీక్షితులు వ్యాఖ్యలను ఖండించాలని కోరారు. రమణ దీక్షితులను ముఖ్యమంత్రి గౌరవ ప్రధాన అర్చకులుగా నియమించినప్పటికీ, నాలు గేళ్లుగా ఆయన గుడికే రాలేదని, ప్రతి నెలా రూ.80 వేల జీతాన్ని మాత్రం తీసుకుంటున్నారని తెలి పారు. రమణ దీక్షితులు, ఆయన కుమారుడు కూడా ఆలయానికి రావడంలేదని తెలి పారు. ఏడాదిలో రెండు మూడుసార్లు వచ్చి రెన్యువల్ చేసుకుని స్వామి కైంకర్యాల్లో పాల్గొనకుండా ఎక్కడో తిరుగుతున్నారని చెప్పారు. వ్యక్తిగత కారణాలతో రెండో కుమారుడు కూడా అర్చక త్వాన్ని విడిచిపెట్టారన్నారు. లుంగీలు, టీ షర్టులు ధరించిన అందరూ క్రిస్టియన్లు కారని అ న్నారు. లుంగీలు, టీషర్టులు ధరించిన ధర్మారెడ్డి క్రిస్టియన్ అని చెప్పిన రమణ దీక్షితులు కూడా ఆ వీడియోలో టీ షర్టు ధరించి ఉన్నారని తెలిపారు.
కైంకర్యంలో అధికారుల జోక్యం లేదు
స్వామివారికి నిర్వహించే కైంకర్యాల విషయంలో టీటీడీ చైర్మన్, ఈవో, ఆలయ సిబ్బంది ఎట్టి పరి స్థితుల్లోనూ జోక్యం చేసుకోరని ఆలయ మరో ప్రధాన అర్చకులు కృష్ణ శేషాచల దీక్షితులు తెలిపా రు. ఆలయ వ్యవస్థపై, అధికారులపై తీవ్రస్థాయిలో ఆరోపించిన రమణ దీక్షితులే కొద్ది సమయంలోనే వీడియోలో ఉన్నది తన వాయిస్ కాదంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment