
టీచర్‌పై తెలుగుదేశం నేత దాడి
రభుత్వ అధికారులపై, ఉద్యోగులపై తెలుగుదేశం నేతల దాష్టీకాలు కొనసాగుతున్నాయి.
ప్రభుత్వ విప్ కళ్లముందే దాష్టీకం
సమస్యలు ప్రస్తావిస్తే ఫలితం
పోలీసులకు టీచర్ ఫిర్యాదు
ఒంటిమిట్ట(వైఎస్సార్ కడప): ప్రభుత్వ అధికారులపై, ఉద్యోగులపై తెలుగుదేశం నేతల దాష్టీకాలు కొనసాగుతున్నాయి. మొన్న తహసీల్దార్ వనజాక్షి, చిత్తూరు జిల్లా చిన్నగొట్టిమల్లు మండల తహసీల్దార్ నారాయణమ్మ మీద దాడులకు పాల్పడ్డ తెలుగుదేశం నేతలు తాజాగా వైఎస్సార్ కడప జిల్లాలో రెచ్చిపోయారు. ఇక్కడ ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై దాడికి పాల్పడ్డారు. ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి సమక్షంలో టీడీపీ నేత ఓ టీచర్ చెంప ఛెళ్లుమనిపించాడు. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు శనివారం జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఒంటిమిట్టలో సోమశిల ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించే కార్యక్రమానికి ప్రభు త్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి, కలెక్టర్ రమణ హాజరయ్యారు. ప్రారంభోత్సవం అనంతరం కలెక్టర్ వెళ్లిపోయారు. మేడా మల్లికార్జునరెడ్డి కొద్దిసేపు ఆ ప్రాంతంలోనే ఉండి పనులను పరిశీలించారు.
ఈ సమయంలో ఒంటిమిట్టకు చెందిన టీచర్ రమణ గ్రామంలో తాగునీరు రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రభుత్వ విప్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమయంలో పక్కనే ఉన్న ఒంటిమిట్ట టీడీపీ మం డల అధ్యక్షుడు నరసయ్య ‘నీరు ఎక్కడ రావడం లేదో నీకు తెలుసా’ అని ఆవేశంగా ప్రశ్నించారు. ఉపాధ్యాయునిపై దాడికి పాల్పడ్డాడు. ఈ గొడవను మేడా మల్లికార్జునరెడ్డి చూస్తూ మిన్నకుండిపోయా రు. తనకు జరిగిన ఈ అవమానం మరెవ్వరికీ జరగకూడదంటూ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.