విశాఖ జిల్లా రాంబిల్లి మండలం లోగపాలెం రోడ్డులో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా, మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి.
విశాఖ జిల్లా రాంబిల్లి మండలం లోగపాలెం రోడ్డులో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా, మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. అచ్యుతాపురం మండలం పూడిమడక పంచాయతీకి చెందిన రాజు (24), గంగిరి రమణ (22) బైక్‌పై వెళుతుండగా బొలెరో ఢీకొంది. రాజు తీవ్ర గాయాలతో అక్కడే మృతి చెందాడు. రమణకు కూడా తీవ్ర గాయాలు కావడంతో అనకాపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు.