
న్యూఢిల్లీ: ఆర్థిక అవకతవకల ఆరోపణలు ఎదుర్కొంటున్న రియల్టీ దిగ్గజం ఆమ్రపాలి గ్రూప్ కేసులో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) చైర్మన్ శశాంక్ మనోహర్ పేరు బయటకు వచ్చింది. గ్రూప్ సీఎండీ అనిల్ కుమార్ శర్మ... గృహ కొనుగోలుదారులు చెల్లించిన నిధుల నుంచి రూ.36 లక్షలను దారిమళ్లించి మనోహర్ ఖాతాలో వేసినట్లు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది.
‘ఆమ్రపాలి’ డైరెక్టర్లు, ఎగ్జిక్యూటివ్‌లు కుమ్మక్కై నిధులను దుబారా, దుర్వినియోగం చేసిన వ్యవహారంలో సుప్రీం ఇప్పటికే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు ఆదేశించింది. సుప్రీం తీర్పులో... దారిమళ్లిన నిధులను పొందినట్లు, అనిల్‌కుమార్ శర్మ చెల్లింపులు చేసినవారి జాబితాలో మనోహర్ పేరు రెండుసార్లుంది. దీనిపై ఆయన స్పందిస్తూ... ఈ కేసులో నాలుగేళ్ల క్రితమే తాను పట్నా హైకోర్టులో హాజరైనట్లు తెలిపారు. తనకేం సంబంధం లేదని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment