![GHMC Commissioner Ronald Rose to go on Leave, Amrapali Kata appointed as incharge](/styles/webp/s3/article_images/2024/06/8/Amrapali.jpg.webp?itok=MstgtOjs)
రోనాల్డ్‌రాస్ విదేశీ పర్యటనతో..
సాక్షి, హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్‌రాస్ వ్యక్తిగత పర్యటన నిమిత్తం యూరప్ వెళ్లేందుకు సెలవు పొందడంతో ఆయన స్థానంలో పూర్తిస్థాయి అదనపు బాధ్యతలతో హెచ్‌ఎండీఏ జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్ ఆమ్రపాలిని నియమించారు. ఈ నెల 8,9 తేదీలు, తిరిగి 23వ తేదీ సెలవు దినాలను వినియోగించుకునేందుకు అనుమతితో పాటు 10వ తేదీ నుంచి 22వ తేదీ వరకు రోనాల్డ్ రాస్‌కు ప్రభుత్వం సెలవు మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో 8వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఆమ్రపాలికి ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment