వికారాబాద్: ఆరోగ్యశ్రీ కేసులపై వైద్యులు ప్రత్యేక దృష్టి సారించాలని సబ్ కలెక్టర్ ఆమ్రపాలి పేర్కొన్నారు. శుక్రవారం ఆమె వికారాబాద్ ఏరియా ఆస్పత్రిలో కొనసాగుతున్న ఆరోగ్య శ్రీ సేవలను పరిశీలించారు. పలు రికార్డులను క్షుణ్నంగా తనిఖీ చేసిన సబ్ కలెక్టర్ ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ కేసులు గతేడాది కంటే తక్కువగా నమోదు కావడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే ఇలా జరుగుతోందన్నారు. ఆస్పత్రిలో ఆర్థోపెడిక్ లేకపోవడం, సరైన పరికరాలు లేకపోవడంతో ఆరోగ్యశ్రీ కేసుల సంఖ్య తగ్గినట్లు వైద్యులు వివరించారు. వెంటనే ఈ విషయాలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని చెప్పారు.
అయితే మే నెలలో ఒక ఆరోగ్యశ్రీ కేసు కూడా నమోదు కాకపోవడంపై ఆమె విస్మయం వ్యక్తం చేశారు. ఈ కేసులకు సంబంధించి నిర్లక్ష్యం వహించొద్దని వైద్యులకు సూచించారు. అనంతరం కంటి పరీక్షల విభాగాన్ని ఆమె పరిశీలించారు. కార్యక్రమంలో ఆరోగ్యశ్రీ జిల్లా కో-ఆర్డినేటర్ రితేష్‌సింగ్, డివిజన్ టీంలీడర్ వీరేశం, నెట్‌వర్క్ టీంలీడర్ కిశోర్ తదితరులు పాల్గొన్నారు.
ఆరోగ్యశ్రీ కేసులపై ప్రత్యేక శ్రద్ధపెట్టండి
Published Sat, Jul 19 2014 12:47 AM | Last Updated on Mon, Aug 20 2018 4:22 PM
Advertisement
Advertisement