నివేదా థామస్.. గ్లామర్ కన్నా అభినయతారగా గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటి వరకు తెలుగులో చేసిన సినిమాలు కొన్నే అయినా.. ఇక్కడ సంపాదించుకున్న అభిమానం మాత్రం ఘనమే. అందం కన్నా అభినయం మీద ఆమెకున్న శ్రద్ధ అలాంటిది. తనలోని గ్లామర్‌ను ఆమె అశ్రద్ధ చేసినా ఈ బ్రాండ్స్ మాత్రం తీర్చిదిద్దుతున్నాయి..
సొబారికో
దర్జా, విలాసం, సౌకర్యం .. ఈ మూడింటినీ ఒకేసారి ఆస్వాదించాలంటే సొబారికో బ్రాండ్‌ను ఎంచుకోవాలి. దేశంలోని ఏ మూలలో ఏ చేనేత ప్రత్యేకత ఉన్నా.. ఏ కళాకారుడి.. ఏ కళాకారిణి చేతిలో సృజన ఉన్నా అది ఈ బ్రాండ్‌లో ప్రతిబింబిస్తుంది. అందుకే సొబారికో అవుట్ ఫిట్స్‌ను ఇష్టపడని వాళ్లు లేరు సెలబ్రిటీల నుంచి సామాన్యుల దాకా. ఈ అభిమానాన్నే బ్రాండ్ వాల్యూగా స్థిరపరచుకుంది. దాన్నే వారసత్వంగానూ మలచుకుంది ఏళ్లుగా. ఫ్యాబ్రిక్, డిజైన్‌ను బట్టి ధరలు. ఆన్‌లైన్‌లోనూ లభ్యం.
డ్రెస్
బ్రాండ్ : సొబారికో
అనార్కలీ సెట్
ధర: 37,500
జ్యూయెలరీ
బ్రాండ్: అమెథిస్ట్ అండ్ ఆమ్రపాలి
ధర: డిజైన్‌పై ఆధారపడి ఉంటుంది.
అమెథిస్ట్
ఇది కిరణ్ రావు మానస పుత్రిక. అమూల్యమైన కళాఖండాల నిలయం.. ఈ బ్రాండ్. 2000 సంవత్సరంలో ప్రారంభమైంది. దుస్తులు, జ్యూయెలరీ, ఫుట్ వేర్ నుంచి ఇంటి అలంకరణ వస్తువులు.. కాఫీ షాప్ వరకు అన్నిటికీ ఈ అమెథిస్ట్ కేరాఫ్. ఈ బ్రాండ్ రిచ్‌నెస్‌కు తగ్గట్టే ధరలు ఉంటాయి.
ఆమ్రపాలి
నిజానికి ఇదొక మ్యూజియం. అంతరించిపోతున్న గిరిజన సంప్రదాయ ఆభరణాల కళను కాపాడేందుకు ఇద్దరు స్నేహితులు రాజీవ్ అరోరా, రాజేష్ అజమేరా కలసి జైపూర్‌లో ‘ఆమ్రపాలి’ పేరుతో మ్యూజియాన్ని స్థాపించారు. నచ్చిన వాటిని కొనుగోలు చేసే వీలు కూడా ఉంది. అయితే, వీటి ధర లక్షల్లో ఉంటుంది. అందుకే, అలాంటి డిజైన్స్‌లో ఆభరణాలు రూపొందించి తక్కువ ధరకు అందించేందుకు ‘ఆమ్రపాలి జ్యూయెలరీ’ ప్రారంభించారు. ఒరిజినల్ పీస్ అయితే మ్యూజియంలో, మామూలు పీస్ అయితే ఆమ్రపాలి జ్యూయెలరీలో లభిస్తుంది. చాలామంది సెలబ్రిటీస్‌కు ఇది ఫేవరెట్ బ్రాండ్. ఆన్‌లైన్‌లో కూడా ఆమ్రపాలి జ్యూయెలరీని కొనుగోలు చేయొచ్చు.
Comments
Please login to add a commentAdd a comment