
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్‌కు దొరికిన మరో అందాల హీరోయిన్ నివేదా థామస్. బాలనటిగా తెరంగేట్రం చేసి హీరోయిన్‌గా ఎదిగిన ఈ కేరళ కుట్టి తెలుగులో కూడా తన ప్రత్యేకతను చాటుకుంటోంది. జెంటిల్‌మేన్ నుంచి వకీల్ సాబ్ దాకా అటు నటనతో, ఇటు అందంతో ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ డింపుల్ బ్యూటీకి హ్యాపీ బర్త్‌డే అంటోంది సాక్షి. కామ్.
కేరళ కుట్టి
1995, నవంబర్ 2న జన్మించింది నివేదా థామస్. నివేదా థామస్ తండ్రి తామస్ ఇయన బిజినెస్ మేన్. తల్లి పేరు లిల్లీ. నివేదాకు నిఖిల్ అనే తమ్ముడున్నాడు . నివేదాను ఇంట్లో అందరూ బేబీ అని పిలుస్తారట. పుట్టింది కేరళలోనే అయినా విద్యాభ్యాసం మొత్తం తమిళనాడులోని చెన్నలోనే. బాలనటిగా తన కెరీర్‌ని స్టార్ట్ చేసిన ఈ అమ్మడు హీరోయిన్ కావాలనే కలలు కనేదిట. అలా మోడల్‌గా రాణిస్తూ మలయాళం, తెలుగు, తమిళ భాషల్లో సినిమా అవకాశాలను దక్కించుకుంది.
బాలనటిగా ఎంట్రీ, అవార్డు
2002లో మలయాళ చిత్రం ఉత్తరతో బాలనటిగా తెరంగేట్రం చేసింది నివేదా. సన్ టీవీలో ప్రసారమయ్యే బాలల సీరియల్ మై డియర్ బూతంలో కూడా నటించింది. మలయాళం సినిమా 'వెరుథె ఒరు భార్య' సినిమాలో జయరాం కుమార్తెగా నటించింది. అలాగే చాలా తమిళ, మలయాళ చిత్రాల్లో సహాయ నటిగా నటించింది. అలా అంచెలంచెలుగా ఎదుగుతూ తన దైన నటనతో ప్రశంసలందుకుంది. ఆ తరువాత నివేదా చాప్పా కురిష్, తట్టతిన్ మరయతు వంటి విజయవంతమైన సినిమాల్లో పాపులర్ అయింది.
మలయాళ చిత్రం వెరుథె ఒరు భార్య సినిమాకు గాను విమర్శకుల ప్రశంసల మాత్రమే కాదు, కేరళ రాష్ట్ర ఉత్తమ యువ నటి పురస్కారం అందుకుంది. ఇక టాలీవుడ్ డెబ్యూ మూవీతో జెంటిల్‌మేన్‌లో కూడా బాగా ఆకట్టుకుంది. డైరెక్టర్ ఇంద్రగంటి మోహన కృష్ణ రూపొందించిన జెంటిల్మెన్ సినిమా ద్వారా నివేదాథామస్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తరువాత నిన్నుకోరి, బ్రోచేవారెవరురా, జై లవకుశ, 'జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్' యాక్షన్, రొమాంటిక్ ఎంటర్టైనర్ 118, వీ తదితర సినిమాలతో కర్రకారు మనసు దోచుకుంది. ఇక తన లేటెస్ట్ హిట్ వకీల్ సాబ్‌లో అద్భుతంగా నటించి ఫ్యాన్స్‌ను ఖుషీ చేసింది. దాదాపు తను నటించిన ప్రతీ మూవీ హిట్ టాక్ దక్కించుకోవడం నివేదాకు ప్లస్ పాయింట్ అని చెప్పాలి. (Aishwarya Rai Bachchan Birthday Special: తన పిచ్చి సెంటిమెంట్‌పై ఐశ్వర్య కామెంట్స్)
ఎత్తైన శిఖరం కిలిమంజారో అధిరోహణ
తన అందం, అభినయంతో యూత్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ ఇటీవల ఓ అరుదైన ఘనతను సాధించింది. ఆఫ్రికాలోనే ఎత్తైన పర్వతం కిలిమంజారోను అధిరోహించింది. చాలా తక్కువ మంది సెలబ్రిటీలు ఇలాంటి సాహసానికి పూనుకుంటారు. ఈ ఘనత సాధించడం పట్ల ఫ్యాన్స్‌తో పాటు, పలువురు ప్రముఖులు అభినందనలు కురిపించారు. ప్రస్తుతం మీట్ క్యూట్, మిడ్‌నైట్ రన్నర్స్ రిమేక్‌గా తెరకెక్కుతున్న మరో మూవీలో కూడా నివేదా నటిస్తోంది. చిన్న వయసునుంచే హీరోయిన్ కావాలన్న కోరిక నేపథ్యంలో అటు చదువును, ఇటు కరియర్‌ను బ్యాలెన్స్ చేసుకుంటూ హీరోయిన్‌గా ఎదిగింది. ఈ నేపథ్యంలో కొన్నిసార్లు షూటింగ్ వెళ్లి ఆ మేకప్‌తోనే నే క్లాస్‌కు హాజరైన సందర్భాల చాలా ఉన్నాయని ఒక ఇంటర్వ్యూలో నివేద థామస్ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment