Heroine Nivetha Thomas Chit Chat With Netizens In Social Media, Viral - Sakshi
Sakshi News home page

Heroine Nivetha Thomas: అలాంటి ప్రదేశం అంటే చాలా ఇష్టం: హీరోయిన్‌ నివేదా

Published Thu, Mar 24 2022 7:55 AM | Last Updated on Thu, Mar 24 2022 11:26 AM

Heroine Nivetha Thomas Chitchat With Netizens In Socialmedia - Sakshi

నివేదా థామస్‌కి నచ్చే విషయాలేంటి? ‘ది బెస్ట్‌’గా ఉండేందుకు ఆమె ఏం చేస్తారు? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం దొరికింది. ‘మీరు అడిగితే నేను చెబుతా’ అంటూ సోషల్‌ మీడియాలో తనను ఫాలో అవుతున్నవారికి ఓ ఆఫర్‌ ఇచ్చారు నివేదా. నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు నివేదా టక టకా సమాధానాలు చెప్పేశారు. ఆ విశేషాలు.. 

► మీరు ది బెస్ట్‌గా ఉండేందుకు మీలో స్ఫూర్తిని నింపే అంశాలు ఏంటి? 
ప్యాషన్‌. మనం ఏ పని చేసినా పూర్తి శక్తి సామర్థ్యాలతో చేయాలి. ఒకవేళ అలా చేయకపోతే నా వర్క్‌కి అన్యాయం చేశాననే ఫీలింగ్‌ నాకు కలుగుతుంది. పని పట్ల నాకు ఉన్న ప్యాషన్‌తో పూర్తి స్థాయిలో కష్టపడతాను. 

► ఈ మధ్యకాలంలో మీకు నచ్చిన ఓ వెబ్‌ సిరీస్‌? 
మారే ఆఫ్‌ ఎస్టోన్‌ (అమెరికన్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌). 

► మీ ఫేవరెట్‌ ప్లేస్‌? 
చల్లని వాతావరణంతో రాత్రి నిశ్శబ్దంగా ఉండాలి. ఆకాశం నిండా నక్షత్రాలు ఉండాలి... ఇలా ఉండే ఏ ప్లేస్‌ అయినా నాకు ఇష్టమే. 



► మీకు బాగా ఇష్టమైన తమిళ సినిమా? 
నా ఫేవరెట్‌ మూవీస్‌లో ‘దళపతి’ ఉంది. ఈ సినిమాలో సంతోష్‌ శివన్‌గారి సినిమాటోగ్రఫీ మ్యాజిక్‌లా ఉంటుంది. 

► రాత్రివేళ ఎక్కువ సేపు మేల్కొని ఉంటారా? 
అలా ఏం లేదు. కానీ నేను నిద్రపోయే సమయాలను మునుపటిలా ట్రాక్‌లో పెట్టాలనుకుంటున్నాను. 

► మీకు ఇష్టమైన ఆహారం? 
ఇది చెప్పడానికి ఎక్కువసేపు అవుతుంది. ఎందుకంటే లిస్ట్‌ చాలా పెద్దది. 



► హిందీలో మాట్లాడగలరా? 
నహీ తో (మాట్లాడకపోతే అని హిందీలో చెప్పి చమత్కరించారు). 

 ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా చూస్తారా? 
హండ్రెడ్‌ పర్సెంట్‌ చూస్తా. 

► ఐపీఎల్‌లో మీ ఫేవరెట్‌ జట్టు? 
చెన్నై సూపర్‌ కింగ్స్‌. 

► డ్యాన్స్‌ చేయడం, పాటలు పాడటం... వీటిలో  మీకు ఎక్కువగా ఏ విషయంలో నైపుణ్యం ఉంది? 
నిజం చెప్పాలంటే డ్యాన్సింగ్, సింగింగ్‌లో నేను జస్ట్‌ ఓకే. ఇంప్రూవ్‌ చేయాల్సింది చాలా ఉంది. మళ్లీ క్లాసులకు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నాను.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement