![Supreme shock for amrapali group - Sakshi](/styles/webp/s3/article_images/2018/08/2/AMRAPALI.jpg.webp?itok=xsjdOsDt)
న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ రంగంలోని ఆమ్రపాలి గ్రూపుపై సుప్రీంకోర్టు కొరఢా ఝుళిపించింది. గ్రూపు సంస్థల బ్యాంకు ఖాతాల వివరాలను తమ ముందుంచాలన్న కోర్టు ఆదేశాలను పాటించకుండా మోసం చేయడం, ఆటలాడుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. గ్రూపు కంపెనీలకు చెందిన అన్ని బ్యాంకు ఖాతాలు, చరాస్తుల జప్తునకు ఆదేశాలు జారీ చేసింది. 42,000 మందికి ఫ్లాట్లను స్వాధీనం చేయాల్సి ఉన్న ఈ గ్రూపు తాలూకు బ్యాంకు ఖాతాల వివరాలను 2008వ సంవత్సరం నుంచి ఇప్పటిదాకా గురువారంలోపు కోర్టు ముందుంచాలని ఆదేశాలిచ్చింది.
అంతేకాకుండా, ఆమ్రపాలి గ్రూపులోని 40 కంపెనీల డైరెక్టర్ల బ్యాంకు ఖాతాల జప్తునకూ ఆదేశించింది. ఇన్వెస్టర్ల నుంచి ఆమ్రపాలి గ్రూపు కంపెనీలు రూ.2,765 కోట్లను వసూలు చేసి వాటిని దారి మళ్లించినట్టు వచ్చిన ఆరోపణలను జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ యూయూ లలిత్‌తో కూడిన ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంటూ విశ్వాస ఘాతుకానికి పాల్పడినట్టు ప్రాథమిక ఆధారాలున్నాయని అభిప్రాయపడింది.
Comments
Please login to add a commentAdd a comment