అత్యుత్సాహంతో కొందరు యువకులు చేసిన పనిపై వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ అమ్రపాలి మండిపడ్డారు. నవరాత్రుల సందర్భంగా ఖాజీపేటకు చెందిన యువకులు కొందరు.. ‘అమ్రపాలి ఒడిలో వినాయకుడు’ కాన్సెప్ట్‌తో విగ్రహాన్ని తయారుచేసి, ఆ ఫొటోలు, వీడియోలను శుక్రవారం ‘హమారా వరంగల్’ ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేశారు.