ఇతిహాసాల్లోని పాత్రలకు తమ అభినయంతో వెండితెర మీద ప్రాణం పోయడమంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ఆ పరీక్షలో నెగ్గి.. సీతగా జీవించింది కృతి సనన్ ‘ఆదిపురుష్’లో! ఆ టాలెంట్‌కి ఫ్యాషన్ స్టయిల్‌ని క్రియేట్ చేసే చాన్స్ దక్కించుకున్న బ్రాండ్స్‌లో కొన్ని ఇక్కడ..
అర్పితా మెహతా...
సాధారణంగా చాలా మంది తల్లులు .. కూతుళ్లకు చీరకట్టి.. ముస్తాబు చేసి మురిసిపోతుంటారు. కానీ అర్పితాకు మాత్రం అమ్మకు చీరకట్టడమంటే ఇష్టం. పండుగలు, వేడుకలకు అమ్మ, అమ్మమ్మకు చక్కగా చీరకట్టి.. అలంకరించి సంబరపడేది. అలా బాల్యంలోనే.. తన ప్యాషన్ ఫ్యాషనే అని గ్రహించి, పెద్దయ్యాక ముంబైలోని ఎన్‌ఎన్‌డీటీ యూనివర్సిటిలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేసింది. కొంతకాలం ప్రముఖ డిజైనర్ల దగ్గర పనిచేసి.. 2009లో సొంత లేబుల్ ‘అర్పితా మెహతా’ను ప్రారంభించింది. వైవిధ్యమైన, ఆధునిక డిజైన్స్‌ని క్రియేట్ చేస్తూ, అనతికాలంలోనే అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకుంది. అందుకే వీటి ధరలూ అదే స్థాయిలో ఉంటాయి. ఆన్‌లైన్‌లో లభ్యం.
ఆమ్రపాలీ జ్యూలరీ
ఇద్దరు స్నేహితులు రాజీవ్ అరోరా, రాజేష్ అజమేరా కలసి జైపూర్‌లో ‘ఆమ్రపాలీ’ పేరుతో మ్యూజియాన్ని స్థాపించారు. ఇందులో నచ్చిన వాటిని కొనుగోలు చేసే వీలూ ఉంది. అయితే, వీటి ధర లక్షల్లో ఉంటుంది. అందుకే, అలాంటి డిజైన్స్‌లో ఆభరణాలను రూపొందించి తక్కువ ధరకు అందించేందుకు ‘ఆమ్రపాలీ జ్యూలరీ’ ప్రారంభించారు. ఒరిజినల్ పీస్ అయితే మ్యూజియంలోనూ, మామూలు పీస్ అయితే అమ్రపాలి జ్యూలరీలోనూ లభిస్తుంది. చాలామంది సెలబ్రిటీస్‌కి ఇది ఫేవరెట్ బ్రాండ్. ఆన్‌లైన్‌లోనూ కొనుగోలు చేయొచ్చు. జ్యూలరీ బ్రాండ్: ఆమ్రపాలీ జ్యూలరీ ధర: ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. బ్రాండ్: అర్పిత మెహత చీర ధర: రూ. 2,50,000 బ్లౌజ్ ధర: రూ. 40,000.
Comments
Please login to add a commentAdd a comment