Amritha Aiyer Dress By Seema Gujral: అమృతా అయ్యర్.. ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ అంటూ పరిచయమై.. గ్లామర్ పాత్రల కంటే నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను పోషిస్తూ అభిమాన ధనాన్ని పెంచుకుంటోంది. ఆమె సినిమాలే కాదు ఫ్యాషన్ బ్రాండ్స్ పట్లా అంతే నిక్కచ్చిగా ఉంటుందని ఈ డిజైనర్ వేర్ చూస్తే తెలిసిపోతుంది.
సీమా గుజ్రాల్..
కళ్యాణ వేదిక మీద పెళ్లి కూతురు రాజకుమారిలా కనిపిస్తోందంటే.. ఆమె సీమా గుజ్రాల్ డిజైన్ చేసిన దుస్తులను ధరించింది అని అర్థం. ఎటువంటి ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేయకపోయినా.. కేవలం ముగ్గురు ఉద్యోగులను నియమించుకుని 1994లో సీమా ప్రారంభించిన ఓ ఫ్యాషన్ హౌస్ ఇప్పుడొక పాపులర్ వెడ్డింగ్ వేర్ బ్రాండ్‌గా మారింది.
దాదాపు చాలామంది సెలబ్రిటీల పెళ్లిబట్టలను ఆమే డిజైన్ చేసింది. అభిరుచికి తగ్గట్టు ప్రత్యేకంగా డిజైన్ చేయించుకునే అవకాశమూ ఉంది. ఆ దుస్తుల ధరలు డిజైన్‌ను బట్టే ఉంటాయి. వేల నుంచి లక్షల్లో పలుకుతాయి. ఆన్‌లైన్‌లోనూ ఈ డిజైన్ వేర్ అందుబాటులో ఉంది.
పండోరా..
టాప్ మోస్ట్ లగ్జూరియస్ ఫ్యాషన్ బ్రాండ్స్‌లో పండోరా ఒకటి. 1982లో డెన్‌మార్క్‌లో ప్రారంభించిన ఈ బ్రాండ్.. గత ఐదు దశాబ్దాలుగా అరుదైన, అందమైన డిజైన్స్‌లో ఆభరణాలను అందిస్తూ అమ్మాయిల మనసు దోచుకుంటూనే ఉంది. కారణం ఇందులో పనిచేసే ఆభరణాల నిపుణులే. సుమారు ఆరు ఖండాల్లోని వంద దేశాలకు చెందిన 2,600 హస్తకళా నిపుణులు ఈ ఆభరణాలను రూపొందిస్తుంటారు.
ఎక్కువగా థాయ్‌లాండ్‌కు చెందిన వారే కావడంతో మన దేశ సంప్రదాయ ఆభరణాలు కాస్త తక్కువగానే కనిపిస్తాయి ఇక్కడ. అయితే సామాన్యుడి నుంచి సెలబ్రిటీ వరకు ప్రతి ఒక్కరికీ ఈ బ్రాండ్ అంటే తీరని మోజు. ధర కూడా ఆ రేంజ్‌లోనే ఉంటుంది మరి. పలు ప్రముఖ ఆన్‌లైన్ స్టోర్స్‌లోనూ లభిస్తాయి.
నా టేస్ట్‌కు తగ్గట్టే
నాకు గ్లామర్ పాత్రలు సౌకర్యంగా అనిపించవు. ఇప్పటి వరకూ నా టేస్ట్‌కు తగ్గట్టే నాకు సంప్రదాయమైన పాత్రలే వచ్చాయి.
– అమృతా అయ్యర్.
బ్రాండ్ వాల్యూ
డ్రెస్
డిజైనర్: సీమా గుజ్రాల్
ధర: రూ. 1,28,000
జ్యూయెలరీ
బ్రాండ్: పండోరా
ధర: ఆభరణాల నాణ్యత, డిజైన్‌పై ఆధారపడి ఉంటుంది.
-దీపిక కొండి
చదవండి: Amala Paul: అమలాపాల్ కట్టిన చీర ధరెంతో తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment