మాట్లాడుతున్న కలెక్టర్ అమ్రపాలి
కరీమాబాద్ : స్మార్ట్ సిటీ పథకం కింద.. రూ.88 కోట్ల నిధులతో చేపట్టనున్న పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియను వెంటనే పూర్తిచేయాలని అర్బన్ జిల్లా కలెక్టర్ అమ్రపాలి అధికారులను ఆదేశించారు. బుధవారం నగరంలోని కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ కార్యాలయం(కుడా)లో అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 2017–18 సంవత్సరాలకు గానూ ఇప్పటికే రూ.33 కోట్ల పనులు ప్రారంభించామని తెలిపారు. రూ.2.5 కోట్లతో లైబ్రరీ ఆధునీకరణ, రూ.6.50 కోట్లతో గుండ్లసింగారం, వంగపహాడ్, ఎరుకలవాడ, 13వ డివిజన్ జీప్లస్ వన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం, రూ.7.2 కోట్లతో స్మృతి వనం, అంబేడ్కర్ భనం ఆధునీకరణ, రూ.8.3 కోట్లతో వడ్డేపల్లి చెరువు, బంధం చెరువు, ఉర్సు చెరువుల పునరుద్ధరణ, రూ.11.2 కోట్లతో డ్రెయినేజీ, అంతర్గత రోడ్ల నిర్మాణాలు చేపడతామని కలెక్టర్ వివరించారు.
రూ.50 కోట్లతో ప్రతిపాదించిన 292 పనులకు త్వరగా టెండర్లు పిలిచి పనులు పూర్తి చేయాలన్నారు. అలాగే ప్లానెటోరియం అభివృద్ధి, 18 బస్టాపులను నిర్మిస్తామని చెప్పారు. ఇక 2018–19లో రూ.100 కోట్లతో పనులు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ కోరారు. వరంగల్ మునిసిల్ కమిషనర్ వీపీ.గౌతమ్ మాట్లాడుతూ స్మార్ట్ సిటీ పనులన అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. సమావేశంలో మునిసిపల్, ఆర్‌అండ్‌బీ ఇంజినీర్లు, టైన్ ప్లానింగ్ అధికారి అజిత్‌రెడ్డి, స్మార్ట్ సిటీ ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment