Processions
-
గజ కోలాహలం
మైసూరు: కరోనా ఆంక్షల మధ్య ఈదఫా కూడా ప్రఖ్యాత మైసూరు దసరా ఉత్సవాలను నిరాడంబరంగా నిర్వహించనున్నారు. వేడుకల్లో పాల్గొనేందుకు 8 గజరాజులను గురువారం మైసూరుకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఊరేగింపుగా ప్యాలెస్ ఆవరణలోకి ప్రవేశించాయి. ముఖ్య గజం అభిమన్యు, అలాగే విక్రమ, గోపాలస్వామి, ధనుంజయ, కావేరి, చైత్ర, లక్షి్మ, అశ్వత్థామ పేర్లుగల ఏనుగులు వచ్చాయి. అక్టోబరు 7న దసరా ఉత్సవాలు ఆరంభమవుతాయి. 15వ తేదీన ముఖ్య ఘట్టమైన జంబూ సవారీ ఊరేగింపు సాగుతుంది. -
కరోనా ఉధృతి: కర్ణాటక సర్కార్ కీలక నిర్ణయం
సాక్షి, బెంగళూరు: కోవిడ్-19 కేసులు కొత్తగా పెరుగుతున్న దృష్ట్యా, అటు థర్డ్‌వేవ్ ప్రమాదంపై నిపుణులు హెచ్చరికల నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మూడు నెలల పాటు భారీ ఊరేగింపులు నిర్వహించకూడదంటూ ఆదేశాలను జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ, మతపరమైన సమావేశాల్లో భారీగా గుమిగూడటం, ఊరేగింపులను కర్ణాటక ప్రభుత్వం బ్యాన్ విధించింది. ఆగస్టు- అక్టోబర్ వరకు పండుగ సీజన్ ప్రారంభంకాన్ను నేపథ్యంలో వరమహాలక్ష్మి వ్రతం, ముహర్రం, కృష్ణ జన్మాష్టమి, గణేష్ చతుర్థి, దుర్గా పూజ తదితర పండుగ రోజుల్లో స్థానికంగా ఆంక్షలను అమలు చేయడంపై నిర్ణయం తీసుకోవాలని జిల్లా అధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఆగష్టు 12 నుండి ఆగస్టు 20 వరకు అన్ని రకాల ఊరేగింపులపై నిషేధం విధిస్తూ కొత్త మార్గదర్శకాలను గురువారం జారీ చేసింది. మొహర్రం, గణేశ్, దసరా ఉత్సవాల వేడుకలపై విస్తృతమైన ఆంక్షలను ప్రకటించింది. రెండు పండుగలకు సంబంధించిన అన్ని రకాల ఊరేగింపులను నిషేధించింది. ఆలం, పంజా, తాజియాత్‌లను దూరం నుండి వీక్షించాలి. ప్రార్థన మందిరాలలో మాస్క్ ధరించడం తప్పనిసరి. కోవిడ్ సంబంధిత నిబంధనలు పాటిస్తూ మసీదుల వద్ద ప్రార్థనలు జరపాలని పేర్కొంది. అలాగే కమ్యూనిటీ హాళ్లు, ఓపెన్ గ్రౌండ్, షాదీ మహల్ మొదలైన వాటిలో సామూహిక ప్రార్థనలకు అనుమతిలేదు. గణేష్ చతుర్థికి కూడా ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. గణేష్ పందిళ్ల ఏర్పాటు చేయడాన్ని నిషేధించింది. వినాచయక చవితిని సాధారణ పద్ధతిలో జరుపుకోవాలి. వినాయక విగ్రహాన్ని తీసుకువచ్చేటప్పుడు, నిమజ్జన సంయంలో మాత్రమే ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించాలి. గణేశ్, దేవీ విగ్రహాలను నిర్దేశించిన ప్రదేశాలలోనే నిమజ్జనం చేయాలి. దేవాలయాలను ప్రతిరోజూ విధిగా శానిటైజ్ చేయాలి. శానిటైజర్ ఉపయోగించిన తర్వాత మాత్రమే భక్తులను అనుమతించాలి. థర్మల్ చెకింగ్ సదుపాయాన్ని నిర్వాహకులు ఏర్పాటు చేసుకోవాలని కూడా ఈ ఆదేశాల్లో పేర్కొన్నారు. బెంగళూరులో బ్లాక్ ఫంగస్ మాదిరిగా ఎనిమిది మందిలో రెడ్ ఫంగస్ బయటపడింది. ఇప్పటివరకు కరోనా సోకినవారిలో, కోలుకున్నవారిలో కొందరు బ్లాక్‌ఫంగస్, వైట్, యెల్లో ఫంగస్లకు గురికావడం తెలిసిందే. ఇప్పుడు తాజాగా రెడ్ ఫంగస్ వెలుగులోకి వచ్చింది. ఐటీ నగరంలో గత ఐదురోజుల్లో 192 మంది కరోనా రోగుల నుంచి నమూనాలను తీసుకుని పరీక్షలు చేయగా వారిలో 148 మందిలో డెల్టా వైరస్ బయటపడింది. మరో 8 మందిలో రెడ్ ఫంగస్ కనిపించినట్లు బెంగళూరు కార్పొరేషన్ ఆరోగ్య విభాగం ప్రత్యేక కమిషనర్ రణదీప్ తెలిపారు. అయితే రెడ్ ఫంగస్‌తో అంత ప్రమాదం లేదన్నారు. డెల్టా రకం వేగంగా సోకుతుండటం వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బెంగళూరులో జూలైలో నమోదైన మొత్తం కరోనా కేసుల్లో 12 శాతం పిల్లల కేసులు కాగా ఆగస్టు మొదటివారంలో ఇది 13 శాతానికి చేరింది. 12-18 ఏళ్లు మధ్య వయస్సు పిల్లలు ఎక్కువగా బయట తిరుగుతుండటం వల్ల కరోనా సోకుతోందని రణదీప్ తెలిపారు. -
జేసీబీలో ఊరేగిన వధూవరులు
బొమ్మనహళ్లి : పెళ్లి అనేది జీవితంలో మరుపురాని ఘట్టం. వారి వారి ఆర్థిక స్థోమతలను బట్టి వివాహాలను వైభవంగా చేసుకుంటారు. ఇందులో మరో తరహా వ్యక్తులు ఉంటారు. ఆకాశంలో, నీటి అడుగు భాగంలో పెళ్లిల్లు చేసుకుని సాహసాలు చేసేవారు మరికొందరు. ఇక్కడ జేసీబీలో ఊరేగుతున్న ఈ నూతన జంటను చూడండి... పనిపై ఉన్న ప్రేమతోనే సదరు వరుడు, వధువును ఒప్పించి పెళ్లి అయిన తరువాత ఊరేగింపు ఇలా వెరైటీగా చేసుకున్నారు. వివరాలు... దక్షిణ కన్నడ జిల్లాలోని పుత్తూరు సంట్యార్ అనే ప్రాంతానికి చెందిన చేతన్ జేసీబీ ఆపరేటర్. పని పట్ల నిబద్దత ఎంతో ఎక్కువ. పనిని ప్రేమిస్తాడు. సోమవారం చేతన్‌కు మమతతో వివాహం జరిగింది. పెళ్లి తతంగం అంతా పూర్తయిన తరువాత పెళ్లి కుమారుడు చేతన్ జేసీబీలో ఊరేగింపు నిర్వహించాలని కోరాడు. ఇందుకు ఇరు కుటుంబాల వారు సమ్మతించడంతో ఒక జేసీబీని తెప్పించి దానికి ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం నూతన వధూవురులను రెండు కిలోమీటర్ల మేర ఊరేగింపు చేశారు. దారి పొడవునా వధువు ముసిముసి నవ్వులు అందర్ని ఆకట్టుకున్నాయి. చేతన్ స్థానికంగా మంచి పేరు ఉండటంతో పెద్ద ఎత్తున బంధువుల, స్నేహితులు వచ్చి ఆశీర్వదించి వెళ్లారు. -
శ్రీరామనవమి ఊరేగింపులో ఉద్రిక్తత
కోల్‌కతా: పశ్చిమబెంగాల్లో శ్రీరామనవమి ఊరేగింపు సందర్భంగా పలుచోట్ల ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పురూలియా జిల్లాలోని ఆర్షాలో ఆదివారం ర్యాలీ సందర్భంగా తలెత్తిన ఘర్షణలో ఒకరు మృతిచెందారు. డీఎస్పీ స్థాయి అధికారి సహా ఐదుగురు పోలీసులు గాయపడ్డారు. రామనవమి సందర్భంగా రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ వేర్వేరుగా ర్యాలీలు నిర్వహించాయి. పురూలియాలో బీజేపీ ఆధ్వర్యంలో ఆయుధాలు ధరించి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా టీఎంసీ, బీజేపీ మధ్య ఘర్షణ జరిగింది. వర్దమాన్ జిల్లాలో ర్యాలీ సందర్భంగా బీజేపీ, వీహెచ్‌పీ కార్యకర్తలపై దాడులు జరిగాయని, దీని వెనక టీఎంసీ హస్తముందని బీజేపీ ఆరోపించింది. ఈ ఘటనలో ఇరువర్గాలకు చెందిన పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ర్యాలీలు మమత సర్కారుకు వ్యతిరేకంగా ‘హిందువులను ఏకం చేసే’వంటూ బీజేపీ పేర్కొంది. మిడ్నాపూర్ జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ భారీ ఖడ్గాన్ని చేతబూని ర్యాలీలో పాల్గొన్నారు. రామనవమి సందర్భంగా అస్త్ర పూజ చేయటం సంప్రదాయమన్నారు. బీజేపీ చేపట్టిన ర్యాలీల్లో చిన్నారుల చేతికి ఆయుధాలిచ్చారని తృణమూల్ బాలల హక్కుల అధికారులకు ఫిర్యాదు చేసింది. -
ఊరేగింపులు, ర్యాలీలు నిషేధం
ఆలంపల్లి, న్యూస్‌లైన్: ఈనెల 16 వరకు ర్యాలీలు, ఊరేగింపులకు అనుమతులు లేవని జిల్లా ఎస్పీ రాజకుమారి తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠినచర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. సోమవారం ఎస్పీ వికారాబాద్ మున్సిపల్ ఎన్నికల కౌం టింగ్‌ను పర్యవేక్షించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. వికారాబాద్ పట్టణంలో ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కౌంటింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభమై 10:30 గంటలకు ముగిసిందని ఎస్పీ పేర్కొన్నారు. కౌంటింగ్ కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా అప్రమత్తమై బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మున్సిపల్, ప్రాదేశిక ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహించేందుకు అనుమతి లేదని ఆమె చెప్పారు. ఈనెల 16 తర్వాత అనుమతులు పొంది ర్యాలీలు నిర్వహించుకోవచ్చని ఎస్పీ తెలిపారు. వికారాబాద్ ఎన్నికల అధికారి, సబ్ కలెక్టర్ అమ్రపాలి మాట్లాడుతూ.. వికారాబాద్‌లోని 27 వార్డులకు కౌం టింగ్ ప్రశాంతంగా ముగిసిందని చెప్పారు. కౌం టింగ్‌కు సహకరించిన అధికారులకు, నాయకులకు ఆమె అభినందనలు తెలిపారు. నెలకు పైగా ఉత్కం ఠతో ఎదురు చూసిన మున్సిపల్ ఫలితాలు వెలువడడంతో టెన్షన్‌కు తెరపడింది. అంతా సవ్యంగా జరగడంతో అధికారులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.