కదం తొక్కిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు
ధర్నాలు, ర్యాలీలతో దద్దరిల్లిన మండల కేంద్రాలు
నరసాపురంలో గేదెలతో వినూత్న ర్యాలీ
తహసిల్దార్లకు వినతిపత్రాలు అందజేత
ఏలూరు (ఆర్‌ఆర్ పేట) :ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్‌తో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు జిల్లాలోని పలు మండలాల్లో సోమవారం ధర్నాలు, ర్యాలీలు నిర్వహించారు. ప్రజా సమస్యలతో కూడిన వినతిపత్రాలను తహసిల్దార్లకు సమర్పించి.. వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరారు. నరసాపురం, మొగల్తూరులలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు ఆధ్వర్యంలో ర్యాలీలు, ధర్నాలు నిర్వహించారు. నరసాపురం మండలంలో ప్రజలకే కాకుండా పశువులకూ తాగునీరు అందటం లేదని పేర్కొంటూ గేదెలతో ప్రదర్శన చేశారు. ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని కోరారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు మోటార్ సైకిళ్లతో ర్యాలీ జరిపి
రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా నినాదాలు చేశారు. అనంతరం తహసిల్దార్ కార్యాలయాల ఎదుట ధర్నాలు నిర్వహించి వినతిపత్రాలు అందజేశారు. పోలవరం నియోజకవర్గ పరిధిలోని బుట్టాయగూడెంలో పార్టీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు తెల్లం బాలరాజు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. డిమాం డ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసిల్దార్‌కు అందచేశారు. జీలుగుమిల్లిలో పార్టీ మండల కన్వీనర్ గూడవల్లి శ్రీని వాసరావు ఆధ్వర్యంలో ధర్నా చేశారు.
ఆచంటలో పార్టీ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు చెల్లెం ఆనందప్రకాష్, మాజీ జెడ్పీటీసీ ముప్పాళ వెంకటేశ్వరరావు, వైట్ల కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి, ధర్నా చేశారు. పెనుమంట్రలో పార్టీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి మేడపాటి చంద్రమౌళీశ్వరరెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి పెన్మెత్స రామరాజు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్రి విశ్వనాథరెడ్డి భారీ ప్రదర్శన నిర్వహిం చారు. దెందులూరు, పెదవేగి తహసిల్దార్ కార్యాలయాల వద్ద పార్టీ నియోజకవర్గ కన్వీనర్ కొఠారు రామచంద్రరావు ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు జరిగాయి. మెట్లపల్లి సూరి బాబు తదితరులు పాల్గొన్నారు.
జంగారెడ్డిగూడెంలో పార్టీ అధికార ప్రతినిధి పోల్నాటి బాబ్జి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు వందనపు సాయిబాలపద్మ నాయకత్వంలో తహసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. గోపాలపురం నియోజకవర్గ పరిధిలోని దేవరపల్లి, నల్లజర్లలో పార్టీ నియోజకవర్గ కన్వీనర్ తలారి వెంకట్రావు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. చింతలపూడి మండలంలో ఏఎంసీ మాజీ చైర్మన్ బొడ్డు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ధర్నా చేసి తహసిల్దార్‌కు వినతిపత్రం సమర్పిం చారు. రు. కొవ్వూరులో పార్టీ నాయకులు ఎనికే వీర్రాజు, సుంకర సత్యనారాయణ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఆకివీడులో పార్టీ సీనియర్ నాయకుడు కేశిరెడ్డి మురళి ఆధ్వర్యంలో తహసిల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. మంగళవారం కూడా ధర్నాలు, ర్యాలీలు నిర్వహించనున్నారు.
ప్రజా సమస్యలపై సమరం
Published Tue, May 5 2015 3:01 AM | Last Updated on Fri, May 25 2018 9:20 PM
Advertisement
Advertisement